LOADING

Type to search

అక్కినేని హీరోలకు బ్యాడ్ ఇయర్

Movie News Movie Reviews Tollywood

అక్కినేని హీరోలకు బ్యాడ్ ఇయర్

admin1 December 31, 2015
Share

2015 సంవత్సరం అక్కినేని హీరోలకు బ్యాడ్ ఇయర్ అనే చెప్పాలి ఎందుకంటే ముగ్గురు హీరోలు నాగార్జున ,నాగచైతన్య , అఖిల్ నటించిన చిత్రాలు రిలీజ్ అయినవి రిలీజ్ అవుతున్నట్లే పోవడమే కాకుండా దోచెయ్ , అఖిల్ ల రూపంలో దారుణ పరాజయాలను అందించింది . దాంతో అక్కినేని ఫ్యామిలీ ఖంగుతిన్నారు . నాగార్జున నటించిన పూర్తి స్థాయి చిత్రం ఏది రిలీజ్ కాకపోయినప్పటికీ కామియో రోల్ చేసిన ”దొంగాట ”, ”అఖిల్ ” , ” సైజ్ జీరో ”  చిత్రాలు ఫ్లాప్ అవ్వగా నాగచైతన్య నటించిన ”దోచెయ్ ” ఫ్లాప్ అయ్యింది . ఇక ఎన్నో అంచనాల మద్య రిలీజ్ అయిన ”అఖిల్ ” ఘోర పరాజయం పొందడంతో అఖిల్ తో పాటు యావత్ సినీ పరిశ్రమ కూడా అవాక్కయ్యింది . ఎందుకంటే మనం చిత్రంలో అఖిల్ కనిపించింది కొద్ది సేపే కానీ స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయిందని ఇక హీరోగా వస్తే బ్లాక్ బస్టర్ అని భావించారు కట్ చేస్తే అఖిల్ అతిపెద్ద డిజాస్టర్ . మరి 2016 లో అక్కినేని ఫేట్ ఎలా ఉండబోతోందో సంక్రాంతికే తెలిసి పోనుంది ఎందుకంటే జనవరి 15 న నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనా రిలీజ్ అవుతోంది .Nagarjuna_family345

Translate »