LOADING

Type to search

ఆడియో రిలీజ్ ‘గోపాల గోపాల’

Recent Tollywood

ఆడియో రిలీజ్ ‘గోపాల గోపాల’

admin1 January 5, 2015
Share

ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. ‘గోపాల గోపాల’ ఆడియో విడుదల అయింది. కన్నుల పండువగా జరిగిన ఈ కార్యక్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ సహా సినిమా ప్రముఖులంతా పాల్గొన్నారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఆడియో విడుదలకు అభిమాన జనసంద్రం తరలివచ్చింది. టాలీవుడ్ లో రూపొందుతున్న క్రేజ్ మల్టి స్టారర్ గోపాల గోపాల. వెంకటేష్ , పవన్ కళ్యాణ్ లు నటిస్తున్న ఈ సినిమా ఆడియో నిన్న విడుదల అయిన విషయం తెలిసిందే. అభిమానుల కోలాహలం, సినీతారల సందడి మద్య జరిగిన ఈ ఆడియో విడుదల హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. కార్యక్రమంలో పాల్గొన్న వెంకటేష్ మాట్లాడుతూ, ఈ మూవీలో తనది చాలా సింపుల్ క్యారెక్టర్ అన్నారు. పవన్ తో సినిమా చేయాలనుకున్న తన కోరిక ఈ మూవీతో తీరిందన్నారు. పవన్ సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడని తెలియగానే చాలా సంతోషం కల్గిందన్నారు. తన అభిమానులు విక్టరీ అందిస్తే, పవన్ అభిమానులు పవర్ చూపిస్తారని.., ఇద్దరి ఫ్యాన్స్ కలిపి ఈ సంక్రాంతికి పవర్ ఫుల్ విక్టరీ అందిస్తారని చెప్పారు. ఆడియో రిలీజ్ లో మాట్లాడిన పవర్ స్టార్, ఉద్వేగానికి లోనయ్యారు. ఫ్యాన్స్ తనపై చూపిస్తున్న పట్ల ఆనందం వ్యక్తం చేశారు. నా గుండెనిండా అభిమానులే ఉన్నారు. నేనెప్పుడూ దేవుడ్ని ఏది కోరలేదు. కానీ కొందరు ఫ్యాన్స్ వచ్చి ఒక్క హిట్ సినిమా ఇవ్వు అని కోరటంతో.., అది కావాలని దేవుడిని ప్రార్థించాను. ‘గబ్బర్ సింగ్’ రూపంలో అది జరిగింది. నేను మిమ్మల్ని ఎప్పుడూ కలవలేదు.., కానీ ప్రతి ఒక్క ఫ్యాన్ గురించి ఆలోచిస్తాను. ఎందుకంటే ఫ్యాన్ లేకపోతే పవన్ కళ్యాణ్ లేడు కాబట్టి, ఫ్యాన్స్ కోసం ఆలోచిస్తాను. నాకు కథలు ఎంపిక చేయటం రాదని కొందరు చెప్తారు కానీ.., కథలు ఎలా ఎంచుకోవాలో ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లోనే అన్నయ్య చిరంజీవి నేర్పించారు. కష్టపడినా ఫలితం దక్కకపోతే చాలా బాధేస్తుంది. కొన్నిసార్లు ఆ బాధ నాకూ కలిగింది. అని పవన్ చెప్పారు. సినిమా గురించి మాట్లాడుతూ గతంలో వెంకటేష్ తో ఉన్న చనువుతో, బాగా నటించగలిగినట్లు చెప్పారు. మిగతా సినిమాల్లో పాటలు వస్తే నడుస్తూ వెళ్లే తాను ఈ మూవీలో అయితే కాస్త డాన్స్ చేశానని చెప్పారు. అనూప్ పాటలు నచ్చి అతడిని తీసుకోగా తన నమ్మకం నిలబెట్టాడని మెచ్చుకున్నారు. అందువల్లే ‘గబ్బర్ సింగ్2’ తర్వాతి సినిమాకు కూడా అనూప్ సంగీతం అందిస్తాడని చెప్పారు. ఇలా పవన్, విక్టరీ స్పీచ్ ల తో పాటు కామెడి కేరింతలు, డాన్స్ ల కోలాహలం మద్య ‘గోపాల గోపాల’ ఆడియో విడుదల వేడుక ఒక ఉత్సవంలా జరిగింది.అయితే ఈ సినిమా బిజినెస్ భారి స్తాయిలో జరిగిందని సమాచారం. ఇప్పటి వరకు ఎ సినిమాకు జరగని రీతిలో జరిగిందని ట్రేడ్ వర్గాలు బావిస్తున్నాయి. గోపాలా గోపాలా హక్కులు కేవలం నైజం ఏరియాకే భారి పోటిలో దాదాపు 20 కోట్లకు అమ్ముడు పోయాయట ? ఇక ఆంధ్రా అన్ని ఏరియాలకు కలిపి 17 కోట్లు, ఇండియా , ఓవర్సీస్ కలిపి మరో పది కోట్లు మొత్తంగా ఈ సినిమా బిజినెస్సే 45 కోట్లు దాటిందని చెబుతున్నారు, ఈ లేక్కనా ఈ సినిమా తప్పకుండా టాలీవుడ్ లో యాభై కోట్ల మార్కెట్ ను దాటుతుందని మరో టాక్ కుడా ఉంది. పవన్ కళ్యాణ్ క్రేజ్ తో ఈ సినిమా ను భారీగానే అమ్మేసారట ? ఈ సినిమాను సంక్రాంతి కు ముందే అంటే 9న విడుదలకు ప్లాన్ చేస్తున్నారు

Tags:
Translate »