LOADING

Type to search

ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్

Cricket Recent

ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్

admin1 December 11, 2014
Share

బౌల‌ర్లు తేలిపోయినా బ్యాట్స్‌మెన్స్ నిల‌బెట్టారు. ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ `ప‌ట్టు`జార‌విడ‌వ‌కుండా బ్సాట్స్‌మెన్ కాపాడారు. మూడో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి భార‌త్ త‌న తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల న‌ష్టానికి 369 ప‌రుగుల స్కోర్ సాధించింది. కోహ్లి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడా. సెంచ‌రీ (115) తో అద‌ర‌గొట్టాడు. కెప్టెన్‌గా త‌న తొలి మ్యాచ్‌లోనే సెంచ‌రీ చేసిన మూడో భార‌తీయుడిగా రికార్డు సృష్టించాడు. విజ‌య్ (53), పుజారా (73), రెహానె (63) ప‌రుగుల‌తో ఆక‌ట్టుకొన్నారు. రోహిత్ శ‌ర్మ (33 బ్యాటింగ్), సాహా (1 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. అంత‌కు ముందు ఆస్ట్రేలియా త‌న ఓవ‌ర్‌నైట్ స్కోర్ (517) ప‌రుగుల వ‌ద్దే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. భార‌త్ త‌న తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 148 ప‌రుగులు వెనుక‌బ‌డి ఉంది.

Tags:
Translate »