LOADING

Type to search

ఆస్ట్రేలియా, భారత్ తొలి టెస్టులో ఆసీస్ విజయం

Cricket Recent

ఆస్ట్రేలియా, భారత్ తొలి టెస్టులో ఆసీస్ విజయం

admin1 December 13, 2014
Share
ShareShare on FacebookShare on Google+Tweet about this on Twitter

విజయంతో ఫిల్ హ్యూస్‌కు ఘన నివాళి అర్పిస్తామని ప్రకటించిన ఆస్ట్రేలియా జట్టు అన్న మాటను నిలబెట్టుకుంది. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ఆస్ట్రేలియా, భారత్ తొలి టెస్టులో ఆసీస్ విజయం సాధించింది. 364 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్సింగ్స్ ఆరంభించిన టీమిండియా ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ మురళీ విజయ్ అత్యద్భుతమైన రీతిలో 99 పరుగులు సాధించగా, అతడికి జత కలిసిన కెప్టెన్ కోహ్లీ సెంచరీతో సత్తా చాటాడు. ఇంతలో మురళీ విజయ్ 99 పరుగుల వద్ద ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. తరువాత వచ్చిన రైనాను ఎల్బీడబ్ల్యూగా లియాన్ దొరకబుచ్చుకున్నాడు. రోహిత్ కూడా అతనికే దొరకేశాడు. సెంచరీ చేసి మంచి ఊపుమీదున్న కెప్టెన్ కోహ్లీ ఆడిన బంతి అనూహ్యంగా గాల్లోకి లేచింది… దానికి భారీ మూల్యం చెల్లించుకున్నాడు. అనంతరం ఆసీస్ విజయం లాంఛనమే అయింది. షమీ, ఆరోన్, ఇషాంత్ వీలైనంత తొందరగా వికెట్లిచ్చేసి తొలి టెస్టు విజయాన్ని ఆసీస్‌కు కట్టబెట్టారు. దీంతో టీమిండియా 48 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

Tags:
Translate »