Friday , 24 November 2017
Breaking News
27
You are here: Home » Cricket » క్వార్టర్స్ లో తలపడే టీమ్ లో..

క్వార్టర్స్ లో తలపడే టీమ్ లో..

ShareShare on FacebookShare on Google+Tweet about this on Twitter

గ్ దశలో డిఫెండింగ్ చాంపియన్ ఇండియా, ఆతిథ్య జట్టు న్యూజిలాండ్ లు మాత్రమే ఓటమి లేకుండా అన్ని మ్యాచ్ ల్లో విజయం సాధించాయి.ఇక మరింతా రసవత్తరంగా మారేందుకు కీలకమైన క్వార్టర్స్ దశ షురూ కాబోతోంది. ఉత్కంఠభరితంగా సాగుతున్న వరల్డ్ కప్ క్రికెట్ లో లీగ్ ఎపోసోడ్ ముగిసింది.ఈ నెల 18 నుంచి క్వార్టర్స్ మ్యాచ్ లు మొదలు కాన్నాయి. ఆ తర్వాత సెమీస్ మ్యాచ్ లు.. 29న గ్రాండ్ ఫైనల్ జరగనుంది. ఈ మెగా ఈవెంట్ లో 14 జట్లు పాల్గొనగా ఎనిమిది క్వార్టర్స్ కు వెళ్లాయి. లీ గ్రూపు-ఎ టాపర్ గా కివీస్, ‘బి’ టాపర్ గా ఇండియా నిలిచాయి. ఉపఖండం జట్లు భారత్, పాక్, లంక, బంగ్లాదేశ్ నాకౌట్ కు అర్హత సాధించాయి.
క్వార్టర్స్ లో గ్రూపు-ఎ టాప్ 4 జట్లు.. గ్రూపు-బి టాప్ 4 జట్లతో తలపడనున్నాయి.
క్వార్టర్స్ లో తలపడే టీమ్ లో..
శ్రీలంక x సౌతాఫ్రికా: షెడ్యూల్ ప్రకారం గ్రూపు-ఎ మూడో స్థానంలో ఉన్న శ్రీలంక, గ్రూపు-బిలో రెండో స్థానంలో ఉన్న సౌతాఫ్రికా తలపడతాయి. ఈ నెల 18 న జరిగే తొలి క్వార్టర్ ఫైనల్లో శ్రీలంక, సౌతాఫ్రికా పోటీపడనున్నాయి.
భారత్ x బంగ్లాదేశ్: గ్రూపు-బి టాపర్ టీమిండియా, గ్రూపు-ఎ 4వ స్థానంలో ఉన్న బంగ్లా మధ్య పోరు జరుగుతుంది. ఈ నెల 19న జరిగే రెండో క్వార్టర్స్ లో ఉపఖండం జట్లు భారత్, బంగ్లాదేశ్ అమీతుమీ తేల్చుకున్నాయి.
ఆస్ట్రేలియా x పాకిస్తాన్: షెడ్యూల్ ప్రకారం గ్రూపు-ఎ రెండో స్థానంలో ఉన్న ఆసీస్, గ్రూపు-బి మూడో స్థానంలో ఉన్న పాకిస్తాన్ పోటీపడనున్నాయి. ఈ నెల 20న జరిగే మూడో క్వార్టర్స్ లో ఆస్ట్రేలియా, పాకిస్థాన్ లు తలపడనున్నాయి.
కివీస్ x విండీస్: షెడ్యూల్ ప్రకారం గ్రూపు-ఎ టాపర్ కివీస్, గ్రూపు-బి 4వ స్థానంలో ఉన్న విండీస్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ నెల 21న జరిగే చివరి, నాలుగో క్వార్టర్ ఫైనల్లో న్యూజిలాండ్, వెస్టిండీస్ తలపడనున్నాయి.
మార్చి 24, 26న సెమీ ఫైనల్ మ్యాచ్ లు,
మార్చి 29న ఫైనల్ మ్యాచ్ .

About admin1

Comments are closed.

Scroll To Top
Social Media Auto Publish Powered By : XYZScripts.com