LOADING

Type to search

క్షేమంగానే ప్రముఖ నటి మనోరమ

Movie News Recent

క్షేమంగానే ప్రముఖ నటి మనోరమ

admin1 February 17, 2015
Share
ShareShare on FacebookShare on Google+Tweet about this on Twitter

సీనియర్ నటి మనోరమ కన్ను మూసినట్టు ఆదివారం కొన్ని షోషల్ నెట్ వర్క్స్‌లో ప్రచారం సాగింది. దీంతో సినీ వర్గాలు, మనోరమ అభిమానులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. చాలా మంది మీడియా మిత్రులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే, అవన్నీ అసత్య ప్రచారంగా తేలింది.తాను చనిపోలేదని, క్షేమంగానే ఉన్నానంటూ ప్రముఖ నటి మనోరమ తెలిపారు.ఈ విషయాన్ని ఆమె కుమారుడు భూపతి స్పష్టం చేశారు. మనోరమ మరణించినట్లు మీడియాలో వార్తలు రావడంతో భూపతి ఈ మేరకు స్పందించారు. మనోరమ మరణించారన్న వార్తను తీవ్రంగా ఖండించారు. వెయ్యి చిత్రాలకు పైగా వివిధ భాషల్లో నటించి చరిత్రకెక్కిన మనోరమ లాంటి వారిపై ఇలాంటి వదంతులు ప్రచారం కావడం బాధాకరంగా సినీ వర్గాలుపేర్కొంటున్నాయి. మనోరమ కుటుంబ సభ్యులు కూడా ఆమె ఆరోగ్యంగా ఉన్నారని, అసత్య ప్రచారాన్ని దయ చేసి చేయ వద్దని విన్నవించారు.తన తల్లి క్షేమంగానే ఉన్నారని, ఆమె మరణించారన్న వార్త అవాస్తమని తెలిపారు. గతంలో కూడా ఇలాంటి వార్తలు రావడంపట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. కాగా ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ఎమ్.ఎస్.నారాయణ విషయంలో కూడా అలాగే జరగడం గమనార్హం.

Tags:

You Might also Like

Translate »