Friday , 24 November 2017
Breaking News
27
You are here: Home » Movie News » గోపాల గోపాల ఆడియో 28న ?
gopala gopala audio

గోపాల గోపాల ఆడియో 28న ?

ShareShare on FacebookShare on Google+Tweet about this on Twitter

గోపాల గోపాల మూవీకి సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులు ఆసక్తిని కనపబరుస్తున్నారు. దాదాపు డిసెంబర్ 28న గోపాల గోపాల మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఉండొచ్చని టాక్. అయితే ఈ చిత్రం ఆడియో వేడుక రొటీన్ ఆడియో వేడుకల్లా కాకుండా డిఫరెంటుగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అప్ కమింగ్ క్రేజీ ప్రాజెక్ట్ గా పేరు తెచ్చుకున్న మూవీ గోపాల గోపాల. ఇదిలా ఉంటే తాజాగా రిలీజ్ అయిన గోపాల గోపాల మూవీ ఫస్ లుక్ టీజర్, అందరిని ఆకట్టుకుంటుంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన మరో టీజర్ ని రిలీజ్ చేయన్నారు. చిత్ర యూనిట్ దీనికి సంబంధించని పనుల్లో బిజిగా ఉంది. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్, వెంకటేష్ మల్టీ స్టారర్ గా నటిస్తున్న ఈ ‘గోపాల గోపాల’ చిత్రం ఆడియో, ఈ నెలలో విడుదల కానుంది.  ఆరోజు పవన్ కళ్యాణ్, వెంకటేష్ ఇద్దరూ స్టేజ్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఉండొచ్చనే కూడ ఊహాగానాలు వినిస్తున్నాయి. అలాగే ఈ చిత్ర ఆడియో ఫంక్షన్ కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. హిందీ చిత్రం ‘ఓ మై గాడ్‌’కు రీమేక్‌ ఇది. డాలీ దర్శకత్వం వహిస్తున్నారు. డి.సురేశ్‌బాబు, శరత్‌మరార్‌ నిర్మాతలు. విక్టరీ వెంకటేష్‌, పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మల్టీస్టారర్‌గా నటిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. 2015 సంక్రాంతి వేధికగా ఈ మూవీ రిలీజ్ కానుంది. గోపాల గోపాల మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో అని ఇప్పుడు ఇండస్ట్రీలోని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేసే పనిలో ఉన్నారు.

gopala gopala audio

About admin1

Comments are closed.

Scroll To Top
Social Media Auto Publish Powered By : XYZScripts.com