చిరంజీవి మాత్రం వేదిక పై ఉండి తీరాలని రజినీకాంత్

0
ShareShare on FacebookShare on Google+Tweet about this on Twitter

సూపర్ స్టార్ రజనీకాంత్‌ ను మెగాస్టార్ చిరంజీవి టెన్షన్ పెడుతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఈరోజు జరగబోతున్న ‘లింగ’ ఆడియో వేదికకు రజినీకాంత్ భాగ్యనరం చేరుకున్నాడు అని టాక్. ఈరోజు హైటెక్‌ సిటీలోని నోవాటెల్‌ హోటల్‌లో జరిగే ‘లింగ’ ఆడియో విడుదల కార్యక్రమానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఇప్పటికే రజినీకాంత్ ను కలవడానికి టాలీవుడ్ కు చెందిన చాలమంది ప్రముఖులు ఈరోజు అపాయింట్ మెంట్ ఫిక్స్ చేసుకున్నట్లు టాక్. ఎందరో ప్రముఖులు రజినీ గురించి ఎదురు చూస్తూ ఉంటే రజినీకాంత్ మాత్రం చిరoజీవి కోసం ఎదురు చూస్తున్నాడు అని టాక్. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ‘లింగ’ ఆడియో వేడుకకు ఎంతమంది అతిధులు వచ్చినా చిరంజీవి మాత్రం వేదిక పై ఉండి తీరాలని రజినీకాంత్ పట్టుపడుతున్నట్లు టాక్. కానీ చిరంజీవి ఈరోజు అనుకోకుండా చాల బిజీగా ఉండటంతో ఏదోవిధంగా వీలు చేసుకుని ‘లింగ’ ఆడియో వేడుకకు వచ్చే అవకాశం ఉందని చెపుతున్నారు.  ఈ శుక్రు వారం రజినీకాంత్ పుట్టినరోజున దాదాపు 2,300 ధియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ‘లింగ’ తెలుగు డబ్బింగ్ వర్షన్ కు ఈరోజు నుండి పబ్లిసిటీ జరగబోతోంది. అయితే కొంతమంది మాత్రం మరి నాలుగు రోజులలో విడుదల కాబోతున్న ఈ సినిమా ఆడియో ఇప్పుడు ఇంత హడావిడిగా విడుదల చేసినా ఏమి ప్రయోజనం అని అంటున్నారు. ఈ సినిమాలో విలన్ గా నటించిన జగపతి బాబుకు చెన్నైలో ఈ సినిమా టీజర్ విడుదల వేడుకలో సరైన ప్రాధాన్యత రాలేదు అని విమర్శలు వచ్చిన నేపధ్యంలో రజినీకాంత్ మళ్ళీ అదే తప్పు జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటాడో చూడాలి.

Share.

About Author

Comments are closed.