Tuesday , 19 September 2017
Breaking News
You are here: Home » POLITICS » News » జనతా కా సీఎం.. కేజ్రీవాల్

జనతా కా సీఎం.. కేజ్రీవాల్

ShareShare on FacebookShare on Google+Tweet about this on Twitter

ఢిల్లీలో సామాన్యుడి పార్టీ ఆప్ కనీవినీ ఎరుగని రీతిలో సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఢిల్లీలో ఉన్న 70 అసెంబ్లీ స్థానాలలో 67 స్థానాలను గెలుచుకున్న ఆప్ ప్రతిపక్ష పార్టీలను చీపురుతో ఊడ్చేసింది.ఢిల్లీ శానససభ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ సునామీకి తట్టుకుని నిలబడిన బిజెపి అభ్యర్థులు ముగ్గురు మాత్రమే.
ఈ నేపథ్యంలో ఏఏపీ కార్యాలయం వద్ద ‘జనతా కా సీఎం’ అంటూ కేజ్రీవాల్ ఫ్లెక్సీలు, బ్యానర్లు వెలిశాయి.ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ అనూహ్యమైన విజయం సాధించింది. కాంగ్రెసు పార్టీయే కాకుండా బిజెపి కూడా చావు దెబ్బ తిన్నది. ఆమ్ ఆద్మీ పార్టీకి నువ్వా నేనా అని బిజెపి పోటీ ఇస్తుందని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెప్పాయి. కానీ ఎగ్జిట్ పోల్ సర్వేలను తలదన్నుతూ కేజ్రీవాల్ ఘన విజయం అందుకున్నారు. నిజానికి ఈ ఫలితాలను కేజ్రీవాల్ కూడా ఊహించలేదు.ఇక ఆప్ అధినేత, ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఈ నెల 14న సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఈ నేపధ్యంగా కేజ్రివాల్ కు జెడ్ కేటగిరి భద్రతను ఏర్పాటు చేయనున్నట్లు ఢిల్లీ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. అలాగే ఆయన రక్షణ కోసం 30మంది కమెండోలను ఏర్పాటు చేస్తామని ఆయన వివరించారు. కాగా శాసన సభా పక్షనేతగా కేజ్రివాల్ ఎన్నికైన వెంటనే ఈ జెడ్ కేటగిరి భద్రతను ఏర్పాటు చెయ్యనున్నారు. ఇక ప్రోటోకాల్ ప్రకారం ఢిల్లీ ముఖ్యమంత్రికి జెడ్ కేటగిరి భద్రతను ఏర్పాటు చెయ్యాల్సి ఉండడంతో కేజ్రివాల్ కు కూడా త్వరలో భద్రతను పెంచనున్నారు. కాగా ప్రస్తుతం గజియాబాద్ లో నివాసం ఉంటున్న కెజ్రీవాల్ కు 12మంది పోలీసులు భద్రతగా ఉన్నారు.

About admin1

Comments are closed.

Scroll To Top
Social Media Auto Publish Powered By : XYZScripts.com