LOADING

Type to search

‘జైలు యూనిఫాం వేసుకోనని చెప్పాడు’

Bollywood Movie News Movie Reviews Recent

‘జైలు యూనిఫాం వేసుకోనని చెప్పాడు’

admin1 February 25, 2016
Share

61456377678_625x300జైల్లో సంజయ్‌దత్ ప్రవర్తన చాలా బాగుందని ఆయన శిక్షా కాలాన్ని తగ్గించి విడుదల చేశారు. కానీ, అసలు పుణె ఎరవాడ జైలుకు తరలించడానికి ముందు, నేరనిర్ధారణ అయిన తర్వాత ముంబై ఆర్థర్ రోడ్డు జైల్లో ఉండగా.. మన ‘గుడ్‌బోయ్’ సంజూ బాబా జైలు యూనిఫాం వేసుకోడానికి ససేమిరా అన్నాడట. ఆ జైల్లో ఉండగా జైలు యూనిఫాం వేసుకోడానికి అతడు నిరాకరించడంతో.. అధికారులు కాస్త కఠినంగానే వ్యవహరించాల్సి వచ్చిందని మహారాష్ట్ర జైళ్ల శాఖ డీఐజీ స్వాతి సాథె చెప్పారు.

ఎరవాడ సెంట్రల్ జైల్లో దత్ రోజూ ఏం చేసేవాడని అడిగినప్పుడు.. ఇతర ఖైదీల్లాగే రెగ్యులర్ డ్రిల్‌ను అనుసరించేవాడని ఆమె తెలిపారు. ఉదయం 5.30కి లేవడం, ప్రార్థన చేసుకోవడం, వ్యాయామం, తర్వాత టీ, టిఫిన్, తర్వాత ఆ రోజుకు కేటాయించిన పని చేయడం. మిగిలిన ఖైదీలు వర్క్ షెడ్‌కు వెళ్లి పని చేయగా, దత్ మాత్రం పేపర్ బ్యాగులు చేసేవాడని, భద్రతా కారణాల రీత్యా తన సొంత సెల్‌లోనే ఉండి ఈ పని చే సేవాడని ఆమె వివరించారు. జైల్లో ఉన్న ఇన్నర్ సర్క్యూట్ వైసీపీ రేడియోలో రేడియో జాకీ పాత్ర పోషించి.. ఇతర ఖైదీలను ఆహ్లాదపరిచేవాడని కూడా స్వాతి సాథె చెప్పారు. ఎరవాడ జైల్లో సంజయ్ దత్ 42 నెలల పాటు ఉన్నాడు.

Translate »