LOADING

Type to search

టాలీవుడ్ ఎంపరర్ పవన్ కళ్యాణ్ ఇంటి పై రూమర్స్ ?

Recent Tollywood

టాలీవుడ్ ఎంపరర్ పవన్ కళ్యాణ్ ఇంటి పై రూమర్స్ ?

admin1 December 8, 2014
Share

పవన్ ప్రస్తుతం  కట్టుకుంటున్న జూబ్లీహిల్స్ లోని ఇంటి నిర్మాణంలోని కొంత భాగం కూల్చివేసినట్లు టాక్. టాలీవుడ్ ఎంపరర్ పవన్ కళ్యాణ్ ఇంటికి సంబంధించిన ఒక హాట్ న్యూస్ ఈరోజు ఉదయం నుండి వెబ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది.  అయితే దీని పై భిన్న కోణాలతో ఉన్న వార్తలు రూమర్స్ గా ప్రచారంలోకి వచ్చాయి. పవన్ ఇంటికి సరైన పర్మిషన్స్ లేకపోవడం వల్ల నగరంలోని జీహెచ్‌ఎమ్‌సీ అధికారుల ఆదేశాలతో ఈపని జరిగిందని కొందరు భావిస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ కు అత్యంత ఆత్మీయుడైన ఒక జ్యోతిష్య వాస్తు సిద్ధాంతి ఇచ్చిన సూచనలతో కొన్ని మార్పులు చేయడానికి పవన్ కళ్యాణ్ అంగీకారంతోనే ఈ కూల్చివేతలు జరిగాయని మరో రూమర్ వినిపిస్తోంది.  అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన ‘గోపాల గోపాల’ కోసం వారణాసిలో ఉన్నాడు కాబట్టి పవన్ తిరిగి వచ్చే వరకు ఈ విషయం పై సరైన క్లారిటీ  రాదు అనే అభిప్రాయం కూడా ఉంది. ఈ మధ్యనే హీరో వెంకటేష్ కు సంబంధించిన ఒక ఇంటికి కొద్దిరోజుల క్రితం జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు నోటీసులు ఇచ్చిన నేపధ్యంలో వెంకటేష్ తన ఇంటికి సంబంధించిన కట్టడాలను కూల్చి వేసిన సంఘటన తెలిసిందే. దీనితో అదే పంధాలో పవన్ ఇంటి విషయం కూడా జరిగిందా? వాస్తు ప్రభావమా అనే విషయం పై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి.

Tags:
Translate »