LOADING

Type to search

టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్‌లో ‘ఐ’ సినిమాపై పెద్ద వివాదం

Movie News Recent Tollywood

టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్‌లో ‘ఐ’ సినిమాపై పెద్ద వివాదం

admin1 December 21, 2014
Share

టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్‌లో ‘ఐ’ సినిమాపై పెద్ద వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది. డైరెక్టర్‌ శంకర్‌, వైవిద్యమైన పాత్రలకు ప్రాధాన్యత ఇచ్చే హీరో విక్రమ్‌ కాంబినేషన్లో వచ్చే ‘ఐ’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జనవరి రెండవ వారంలో విడుదల కానుంది. టాలీవుడ్‌లో మాత్రం ఆ తేదీన విడుదలయ్యే అవకాశం లేదంటున్నారు. ఇక్కడ విడుదల వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి కి డబ్బింగ్ సినిమాలు రిలీజ్ చేయొద్దని ఓ నియమం పెట్టుకున్నారు ఇక్కడ అందుకే ఆ నిర్ణయాన్ని తుంగలో తొక్కకుండా డబ్బింగ్ చిత్రాన్ని రిలీజ్ కాకుండా చూడటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే గోపాల గోపాల, టెంపర్‌, రుద్రమదేవి వంటి భారీ చిత్రాలు సంక్రాతి బరిలో ఉన్నాయి. ఈ పరిస్థితులలో ‘ఐ’ కూడా విడుదలైతే థియేటర్స్‌ కొరత ఏర్పడే అవకాశం ఉంది. శంకర్ దర్శకత్వంలో ఆస్కార్ రవిచంద్రన్ భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రాన్ని తెలుగులో సూపర్ గుడ్ ఆర్ బి చౌదరి గారు అందిస్తున్నారు. జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో తెలుగులో అదేరోజు విడుదల అవడం డౌటే అంటున్నారు ఫిలిం నగర్ వర్గాలు. దాంతో ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడితేనే మంచిదనే అభిప్రాయం టాలీవుడ్‌ ట్రేడ్‌ వర్గాలలో వినిపిస్తోంది. అదే నిజమైతే తెలుగు ప్రేక్షకులకు సంక్రాంతికి ‘ఐ’ సినిమా చూసే అవకాశం ఉండదు.

Tags:

You Might also Like

Translate »