Wednesday , 13 December 2017
Breaking News
27
You are here: Home » Movie News » దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు
tammareddy bharadwaja

దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు

ShareShare on FacebookShare on Google+Tweet about this on Twitter

తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న లుకలుకలను మరోసారి బయట పెట్టాడు తమ్మారెడ్డి. అనైక్యత వల్లే “మేముసైతం” కార్యక్రమం సక్సెస్ కాలేదన్నారు. ఈమేరకు హైదరాబాద్ లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టాలీవుడ్ తారలు వ్యక్తిగతంగా ఇచ్చిన విరాళాలను…”మేముసైతం”లో కలిపారని తమ్మారెడ్డి అన్నారు. తెలుగు హీరోయిన్లకు నైట్ పార్టీలపై ఉన్న ధ్యాస… ఛారిటీ ప్రోగ్రామ్స్ పై లేదని విరుచుకుపడ్డారు. కొందరు రిహార్సల్స్ రద్దు చేసుకుని పార్టీలకు వెళ్లారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఫిలింఫేర్లకు పాస్‌లు అడుక్కొని వెళ్లేవారు, ఛారిటీ కార్యక్రమాలకు మాత్రం హాజరు కావడం లేదని ఆయన తెలిపారు.ఇంతమంది మేముసైతం అంటే వచ్చింది కేవలం 8కోట్లేనని కానీ ఒకసారి బాలు ఒక్కడే కార్యక్రమం చేస్తే కోటి రూపాయలు వచ్చిందని ఘాటు విమర్శలకు దిగాడు. పనిలో పనిగా హీరోయిన్ లకు కూడా చురకలు అంటించాడు.  ఓ టీవీ చానెల్ డిజైన్ చేసిన కార్యక్రమంలో సినీ పరిశ్రమ పాల్గొన్నదని తమ్మారెడ్డి అన్నారు. “మేముసైతం” కోసం కొంతమంది హీరోలను బతిమిలాడాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

tammareddy bharadwaja

About admin1

Comments are closed.

Scroll To Top
Social Media Auto Publish Powered By : XYZScripts.com