Monday , 20 November 2017
Breaking News
27
You are here: Home » Cricket » ధోని జీవితం పై బాలీవుడ్ లో రామ్ చరణ్ ?
ram charan

ధోని జీవితం పై బాలీవుడ్ లో రామ్ చరణ్ ?

ShareShare on FacebookShare on Google+Tweet about this on Twitter

ఎం.ఎస్. ధోని జీవితం పై బాలీవుడ్ లో ఒక సినిమా నిర్మాణం జరగుతోంది అన్న వార్తలు ఇప్పటికే వచ్చాయి. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక ప్రత్యేక పాత్రను చేయబోతున్నాడు అనే వార్తలు లేటెస్ట్ బాలీవుడ్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.  గత సంవత్సరం ‘జంజీర్’ ఘోరపరాజయంతో బాలీవుడ్ కు చాల దూరంగా ఉంటున్నరామ్ చరణ్ ను ఈ సినిమా దర్శక నిర్మాతలు ఒప్పించి ఈసినిమాలో నటించేలా చరణ్ ఎగ్రిమెంట్ కూడా తీసుకున్నారని బాలీవుడ్ మీడియా టాక్. సుశాంత్ సింగ్ పోషిస్తున్న ధోనీ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ వెబ్ మీడియాకు లీక్ కావడంతో చరణ్ పై ఈ సినిమాకు సంబంధించి వస్తున్న వార్తలు నిజమేనా అన్న అనుమానం చాలామందికి కలుగుతోంది. అయితే చరణ్ ఈ సినిమాలో నటించబోయేది ధోనీ సన్నిహిత మిత్రుడైన సురేష్ రైనా పాత్ర రామ్ చరణ్ ది అని అంటున్నారు.  ఇప్పటికే ధోని పాత్రలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మెయిన్ రోల్ పోషిస్తూ ఉండటంతో ఈ సినిమాలో కీలక ప్రాధాన్యత కలిగిన జడేజా పాత్రలో అమిత్ కుమార్, క్లార్క్ పాత్రలో మహమ్మద్ యూసుఫ్ నటిస్తున్నారు అని కూడా బాలీవుడ్ మీడియాలో వార్తలు కనిపిస్తున్నాయి. ‘ఏ వెడ్నెస్ డే’, ‘స్పెషల్ 26’ వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన నీరజ్ పాండే ఈ సినిమాకి దర్శకనిర్మాతగా వ్యవహరిస్తూ ఉండటంతో నీరజ్ కు బాలీవుడ్ లో ఉన్న ప్రాధాన్యత రీత్యా చరణ్ సెకండ్ హీరో పాత్రకు అంగీకరించాడు అని టాక్. ‘ఎంఎస్ ధోని- ద అన్ టోల్డ్ స్టోరీ’ అనే టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా గురించి వస్తున్న వార్తలు నిజమే అయితే రామ్ చరణ్ బాలీవుడ్ లో మరో సాహసానికి శ్రీకారం చుడుతున్నాడు అనుకోవాలి.

ram charan

About admin1

Comments are closed.

Scroll To Top
Social Media Auto Publish Powered By : XYZScripts.com