Friday , 24 November 2017
Breaking News
27
You are here: Home » Recent » బాహుబలిలో అనుష్క పాత్ర మిస్సింగ్?

బాహుబలిలో అనుష్క పాత్ర మిస్సింగ్?

ShareShare on FacebookShare on Google+Tweet about this on Twitter

ప్రభాస్ కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం వేసవిలో ప్రేక్షకుల ముందుకురానున్న విషయం తెలిసిందే. అనుష్క ఇప్పుడు ‘బాహుబలి, రుద్రమదేవి’ చిత్రాలతో బిజీగా ఉందని అందరికి తెలిసిందే. అయితే రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి’ చిత్రంలో అనుష్క కనిపించదట. టాకీ పూర్తిచేసుకొని ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. బాహుబలి చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన సమాచారం తెలుగు సినీవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన అనుష్క, తమన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. దేవసేన పాత్రలో అనుష్క, అవంతికగా తమన్నా కనిపించబోతున్నారు. ఈ మధ్యే విడుదల చేసిన ఈ నాయికలిద్దరి ఫస్ట్‌లుక్ పోస్టర్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి.ఇదిలావుండగా వేసవిలో విడుదల కాబోతున్న తొలి భాగంలో ప్రధాన కథానాయిక అయినటువంటి అనుష్క పాత్ర వుండదని, కథానుగుణంగా ఆమెపై చిత్రీకరించిన సన్నివేశాలన్నీ రెండో భాగంలోనే వున్నాయని తెలిసింది. మొదటిభాగంలో ప్రభాస్ సరసన తమన్నా కనిపిస్తుందని అంటున్నారు. అనుష్క అభినయాన్ని తిలకించాలంటే రెండో భాగం విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందేనని చెబుతున్నారు. ఈ సమాచారం బయటకు తెలియడంతో దేవసేనగా అనుష్క అభినయాన్ని చూద్దామనుకున్న ఆమె అభిమానులు నిరుత్సాహపడుతున్నారట. చిత్ర బృందం వివరణ ఇస్తేగానీ ఈ విషయంలో నిజానిజాలేమిటో తెలియవని ఫిల్మ్‌నగర్ వర్గాలు అంటున్నాయి.

About admin1

Comments are closed.

Scroll To Top
Social Media Auto Publish Powered By : XYZScripts.com