LOADING

Type to search

బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్ధి కిరణ్‌ బేదీ ఎగ్జిట్‌ పోల్స్‌ను నమ్మొద్దు

News Recent

బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్ధి కిరణ్‌ బేదీ ఎగ్జిట్‌ పోల్స్‌ను నమ్మొద్దు

admin1 February 7, 2015
Share
ShareShare on FacebookShare on Google+Tweet about this on Twitter

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 67.8 శాతం పోలింగ్ నమోదైంది. ముఖ్య ఎన్నికల అధికారి చంద్ర భూషణ్ కుమార్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఢిల్లీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని చెప్పారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం జరిగిన పోలింగ్లో పెద్ద సంఖ్యలో ఓటర్లు పాల్గొన్నారు.హస్తిన గద్దెపై మళ్లీ సామాన్యుడే హస్తిన గద్దెపై మళ్లీ సామాన్యుడే అధిష్ఠించే అవకాశం కనిపిస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ వైపే సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ మొగ్గు చూపుతున్నాయి. సర్వేల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అతిపెద్దగా అవతరించనుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. తాజా ఎన్నికల్లో ఆప్ 31-39 వరకూ సీట్లు గెలుచుకునే ఆస్కారం ఉందని టైమ్స్ నౌ తన సర్వేలో పేర్కొంది. అయితే బీజేపీ మాత్రం 27-35 సీట్లను గెలుచుకుని రెండో స్థానానికే పరిమితం అవుతుందని తెలపగా, కాంగ్రెస్ పార్టీ 2-4 సీట్లను కైవశం చేసుకుంటుందని తెలిపింది. ఇదిలా ఉండగా ఇండియా టుడే సర్వేలో మాత్రం ఆప్ 35-43 సీట్లను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలిపింది. బీజేపీ 22-29, కాంగ్రెస్ 3-5 సీట్లకు మాత్రమే పరిమితమవుతాయని ఇండియా టుడే పేర్కొంది.ఎగ్జిట్‌ పోల్స్‌ను నమ్మొద్దని బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్ధి కిరణ్‌ బేదీ అన్నారు. శనివారం ఢిల్లీలో ఎన్నికల పోలింగ్‌ ముగిసిన అనంతరం పలు మీడియా సంస్థలు తమ ఎగ్జిట్‌పోల్‌ సర్వేలను విడుదల చేశాయి. వీటిపై స్పందించిన బేదీ.. ఫిబ్రవరి 10 వరకు ఆగాలని.. ఢిల్లీలో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సాయంత్రం 3 గంటల వరకు జరిగిన పోలింగ్‌ ఆధారంగానే ఎగ్జిట్‌ పోల్స్‌ నిర్వహించారని, చివరి గంటల్లో భారీగా పోలింగ్‌ నమోదైందన్నారు. ఈ ఎన్నికల్లో సత్యమే గెలుస్తుందన్నారు. తనను నమ్మి ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఎన్నుకున్నందుకు భీజేపీకి బేదీ కృతజ్ఞతలు తెలిపారు.కొన్ని మీడియా సంస్థలు, ఎన్నికల విశ్లేషణ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం కేజ్రీవాల్‌ పార్టీకి 40 శాతం పైగా, భారతీయ జనతా పార్టీకి 37 శాతానికి తగ్గకుండా శనివారం నాటి పోలింగ్ల ఓట్లు పడి ఉండవచ్చని తేలింది. ఈ విశ్లేషణలు ఎంతవరకు నిజమన్నది తేలడానికి ఈనెల 10వ తేదీన ఓట్ల లెక్కింపు జరిగే వరకు నిరీక్షించవలసిందే.

Tags:

You Might also Like

Translate »