బైక్ పై అబ్బుర పరిచే విన్యాసాలు చేస్తున్న ఖమ్మం వాసి

0
ShareShare on FacebookShare on Google+Tweet about this on Twitter

ఖమ్మం: ఏన్కూరు మండలం గ్రామం సూర్యతండా వాసి లచ్చిరాం బైక్ పై అబ్బుర పరిచే విన్యాసాలు చేస్తున్నాడు. బైక్‌ పై విన్యాసాలు చేస్తే.. ఆయన మనసు ఎంజాయ్‌ చేస్తుంది కానీ, చూసేవాళ్ల ఒళ్లు మాత్రం జలదరిస్తుంది. గుండెలు జారిపోతాయంటే కూడా ఎంత మాత్రమూ అతిశయోక్తి కాదు.
వృత్తిరిత్యా ఎలక్ట్రీషియన్‌..గ్రామ సర్పంచ్‌గా కూడా పనిచేసిన లచ్చిరాం, వృత్తిరిత్యా ఎలక్ట్రీషియన్‌. అయితే.. ఆరోగ్యశాఖలో హెల్త్ సూపర్‌ వైజర్‌గా పనిచేసే భార్యను ప్రతిరోజూ ఆఫీసులో దించి వస్తుంటాడు. ఈ క్రమంలో ఒంటరిగా ప్రయాణిస్తున్న సమయంలో తన ఫీట్లకు పదును పెట్టాడు లచ్చిరాం. ప్రయత్నిస్తే సాధ్యం కానిది ఏదీ లేదంటున్న లచ్చిరాం, ఈ విన్యాసాల్లో ప్రావీణ్యం సాధించడానికి ఆరు నెలలు పట్టిందని చెబుతున్నాడు. అయితే ఇంట్లో వేసే యోగాసనాలు వేసే లచ్చిరాం బైక్‌పైనా వాటిని ప్రయత్నించి సక్సెస్‌ అయ్యాడు.ప్రయత్నించవద్దని సలహా..బైక్ పై చేసే విన్యాసాల మాటున పొంచి ఉన్న ప్రమాదం గురించి తెలిసిన లచ్చిరాం, ఇతరులు మాత్రం వీటిని ప్రయత్నించవద్దని సలహా ఇస్తున్నాడు. తనకు ఎలాగో అలవాటైందని, వీటి ద్వారా రికార్డులు సాధించడమే లక్ష్యమంటున్న లచ్చిరాం ఇలాంటి విన్యాసాల వైపు యూత్‌ చూడకపోవడమే మంచిదంటున్నాడు.నానా తంటాలు.. యోగాసనాలు నేలపై వేయడానికే చాలా మంది నానా తంటాలు పడుతుంటారు. అలాంటిది వేగంగా దూసుకెళ్తున్న బైక్‌పై ఆసనాలు వేయడమంటే మాటలు కాదు. ఇలాంటి కఠినమైన ఫీట్లు చేస్తున్న లచ్చిరాం లక్ష్యం నెరవేరాలని, అతను పలు రికార్డులు సాధించాలని కోరుకుందాం.

Share.

About Author

Comments are closed.