LOADING

Type to search

మరో సమ్మె?: కేసీఆర్‌కు ఓయూ తలనొప్పి

News Recent

మరో సమ్మె?: కేసీఆర్‌కు ఓయూ తలనొప్పి

admin1 May 19, 2015
Share

మరో సమ్మె?: కేసీఆర్‌కు ఓయూ తలనొప్పి

kcr
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు మరో తలనొప్పి! మొన్న టీఎన్జీవోలు, నిన్న తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు. ఆ తర్వాత 108 ఉద్యోగులు అదే దారిలో నడిచారు. తాజాగా ఉపాధ్యాయ సమ్మె బాట పట్టేందుకు సిద్ధమయ్యాయి. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా జూన్ 9వ తేదీన ఇందిరాపార్క్ వద్ద మహాధర్నాకు పీఆర్టీయూ పిలుపునిచ్చింది. సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను పీఆర్టీయూ నేతలు కలిశారు. కేసీఆర్‌ సేవా నిబంధనల వెంటనే రూపొందించాలని, హేతుబద్ధీకరణ పేరిట పాఠశాలల మూసివేత మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. వేతన సవరణ బకాయిలను బాండ్ల రూపంలో అంగీకరించబోమని చెప్పారు. మొత్తం 14 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని వారు సీఎస్‌కు అందించారు. జూన్ 9వ తేదీలోగా సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు. అలాగే, రెగ్యులరైజేషన్ పేరుతో ప్రభుత్వ పాఠశాలలు మూసివేయవద్దన్నారు. అలా మూసివేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ అంశం పైనే 9న ధర్నా చేస్తున్నట్లు చెప్పారు. కేసీఆర్‌పై దుమ్మెత్తిపోస్తున్న విపక్షాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. సచివాలయం తరలింపు, హుస్సేన్ సాగర్ శుద్ధి, వంద అంతస్తుల భవంతులు, వినాయక సాగర్.. ఇలా పలు అంశాల్లో కేసీఆర్ విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తాజాగా, ఉస్మానియా విశ్వవిద్యాలయం విషయంలోను టీడీపీ, కాంగ్రెస్ నేతలు కేసీఆర్ పైన నిప్పులు చెరుగుతున్నారు. అందుకు కారణం, ఓయులో కొంత భూమి కొని పేదలకు ఇళ్లు కట్టిస్తామని చెప్పడమే కారణం. అక్కడ స్థలం లేకుంటే మరోచోట కట్టిస్తామన్నారు. అయితే, కేసీఆర్ వ్యాఖ్యల పైన విపక్షాలతో పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు భగ్గుమన్నారు. సచివాలయం ఎదుట విద్యార్థులు ఆందోళన చేసారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, సంపత్, టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర రావు, రావుల చంద్రశేఖర రెడ్డి తదితరులు కేసీఆర్ తీరును ప్రశ్నించారు. టీడీపీ నిలదీత మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ పాల్గొన్నారని తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌ రావు సోమవారం ప్రశ్నించారు. పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడి ఎన్నికపై ఏకాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ మేరకు హన్మకొండ చంద్రా గార్డెన్స్‌లో జిల్లాకు చెందిన పార్టీ నేతలంతా సమావేశమయ్యారు. ఎన్నిక పరిశీలకులుగా రావుల చంద్రశేఖర్‌ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య వ్యవహరించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు అక్కడి ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సాయం ఇస్తోందని, మరి తెలంగాణలో రైతులకు తెరాస ప్రభుత్వం ఏమిచ్చిందని నిలదీశారు. మరో 6 నెలలు ఓపిక పడితే తెరాస కార్యకర్తలను ప్రజలు తరిమికొట్టే రోజులు వస్తాయన్నారు.

Translate »