Tuesday , 19 September 2017
Breaking News
You are here: Home » Movie News » మహాలక్ష్మీ బాలీవుడ్ ఎంట్రీ

మహాలక్ష్మీ బాలీవుడ్ ఎంట్రీ

ShareShare on FacebookShare on Google+Tweet about this on Twitter
51456983563_625x300తొలి సినిమాతో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ మెహరీన్ బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతుంది. నాని హీరోగా తెరకెక్కిన ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ సినిమాతో మహాలక్ష్మీగా వెండితెరకు పరిచయం అయిన ఈ భామ, తన నటనతో ఆకట్టుకుంది. తెర మీద కాస్త బొద్దుగా కనిపించినా.., గ్లామర్తో పాటు పర్ఫామెన్స్లోనూ మంచి మార్కులు సాధించింది. దీంతో ఈ అమ్మడికి వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి.
ఇప్పటికే తెలుగులో కళ్యాణ్ రామ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాతో పాటు సాయిధరమ్ తేజ్, బీవీయస్ రవి కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాల్లో హీరోయిన్గా ఫైనల్ అయ్యింది. వీటితో బాలీవుడ్లోనూ ఓ సినిమాను అంగీకరించింది మెహరీన్. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ నిర్మాతగా తెరకెక్కిస్తున్న ఓ సినిమాలో పంజాబీ అమ్మాయిగా నటించనుంది మెహరీన్. పలు ప్రకటనల్లో నార్త్ ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ భామ ఇప్పుడు హీరోయిన్గా అలరించడానికి రెడీ అవుతోంది.

About admin1

Comments are closed.

Scroll To Top
Social Media Auto Publish Powered By : XYZScripts.com