LOADING

Type to search

మాటలతో కాకుండా ఏకంగా చేతల్లోనే తన స్పందనను చూపించాడు టాలీవుడ్ హీరో వెంకటేష్

Recent Tollywood

మాటలతో కాకుండా ఏకంగా చేతల్లోనే తన స్పందనను చూపించాడు టాలీవుడ్ హీరో వెంకటేష్

admin1 December 8, 2014
Share

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ జారీ చేసిన నోటిసులపై టాలీవుడ్ హీరో వెంకటేష్ స్పందించారు. అయితే లేట్ అయినా.. లేటెస్టుగా తన స్పందించాడాయన. మాటలతో కాకుండా ఏకంగా చేతల్లోనే తన స్పందనను చూపించాడు. హైదరాబాద్ ఫిలింనగర్ రోడ్ నంబర్-1లో తన ప్లాట్‌లో అనుమతులు లేకుండా నిర్మించిన షెడ్డును స్వయంగా ఆయనే కూలీలను నియమించుకొని కూల్చివేయించారు. ఫిలింనగర్‌లోని ప్లాట్ నంబర్-3లో వెంకటేష్కు ఫ్లాట్ ఉంది. గత కొద్ది రోజులుగా ఈ ఫ్లాట్‌లో అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలు జరుగుతుండటంతో రెండు వారాల క్రితం జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. పక్షం రోజుల్లో వాటిని కూల్చివేయకపోతే తామే కూల్చివేస్తామని నోటీసులో హెచ్చరించారు. దీనికి స్పందించిన వెంకటేశ్ నోటీసు గడువుకు ఒక రోజు ముందే ఆక్రమణలను నేలమట్టం చేయించారు. నిర్మాణాలు కూల్చివేసిన ప్రాంతాన్ని ఫొటోలు తీయించి జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులకు అందించారు.

Tags:
Translate »