మీలో ఎవరు కోటిశ్వరుడు’ లో చిరంజీవి

0
ShareShare on FacebookShare on Google+Tweet about this on Twitter

హైదరాబాద్: సినిమా ఇండస్ట్రీలో కెరీర్ పరంగా ఒకరితో ఒకరు పోటీ పడటం,
కొన్ని సార్లు గొడవలు పడటం సర్వ సాధారణమే. తెలుగు సినిమా పరిశ్రమ కూడా
అందుకు మినహాయింపు ఏమీ కాదు. కానీ తెలుగులో ఇద్దరు స్టార్ హీరోల మధ్య
మధ్య మొదటి నుండీ ఆరోగ్య కరమైన పోటీ వాతావరణం ఉంది. ఇద్దరి మధ్య ముందు
నుండీ మంచి సంబంధాలు ఉన్నాయి. వారిద్దరూ మరెవరో కాదు మెగాస్టార్
చిరంజీవి, అక్కినేని నాగార్జున. ఇప్పటి వరకు వీరు అనేక సందర్భాల్లో
కలిసారు. వివిధ కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. కానీ ఈ సారి మాత్రం
వీరు డిఫరెంటుగా కలవబోతున్నారు. ఒకరు ప్రశ్నల వర్షం
కురిపిస్తుంటే…మరొకరు వాటిని ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు.
అవును! మీరు ఊహించింది నిజమే. అక్కినేని నాగార్జున నేతృత్వంలో నడుస్తున్న
‘మీలో ఎవరు కోటిశ్వరుడు’ అనే కార్యక్రమంలో చిరంజీవి పాల్గొన్నారు. ఇటీవలే
ఈ ఎపిసోడ్ చిత్రీకరణ జరిగినట్లు తెలుస్తోంది. ఆగస్టు 3వ తేదీన ఈ షో
ప్రసారం కాబోతోంది. ఈ కార్యక్రమంలో ఇద్దరి మధ్య జరిగే సంభాషణలు
ఆసక్తికరంగా ఉండబోతున్నాయి. అదే విధంగా నాగార్జున చిరంజీవిని అడిగే
ప్రశ్నలు కూడా హాట్ హాట్‌గా ఉండబోతున్నాయి. ఇప్పటికే ఈ కార్యక్రమంలో
విద్యా బాలన్, శ్రీయ, లక్ష్మి మంచు, చార్మి కౌర్, అల్లరి నరేష్ లాంటి
వాళ్లు హాట్ సీట్లో కూర్చుని సందడి చేసారు. త్వరలో చిరంజీవి 150వ
సినిమాకు సిద్ధమవుతున్న తరుణంలో ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన బోతుండటం
చర్చనీయాంశం అయింది.mek

Share.

About Author

Comments are closed.