Sunday , 24 September 2017
Breaking News
You are here: Home » Movie News » రవితేజ కథానాయకుడిగా బెంగాల్ టైగర్

రవితేజ కథానాయకుడిగా బెంగాల్ టైగర్

ShareShare on FacebookShare on Google+Tweet about this on Twitter

రవితేజ, తమన్నా, రాశీ ఖన్నా కాంబినేషన్లో శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పతాకంపై సంపత్ నంది దర్శకత్వంలో కె.కె. రాధా మోహన్ నిర్మిస్తున్న ‘బెంగాల్ టైగర్’ ఈరోజు (30.01.) ప్రారంభమైంది. హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో జరిగిన ఈ ప్రారంభోత్సవ వేడుకలో పలువురు చిత్రరంగ ప్రముఖులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం నాయకానాయికలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి కె.రాఘవేంద్రరావు క్లాప్ నివ్వగా, వి.వి.వినాయక్ కెమెరా స్విఛాన్ చేశారు. సురేందర్‌రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ ఇదొక ఎనర్జిటిక్ కమర్షియల్ ఎంటర్‌టైనర్. సంపత్‌నందితో ఏమైంది ఈ వేళ సినిమా తరువాత మళ్లీ కలిసి పనిచేస్తున్నాను. మార్చి 2 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో చిత్రాన్ని విడుదల చేస్తాం. మా సంస్థ తీసిన గత చిత్రాలను ఆదరించినట్టుగానే ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను అన్నారు. తమన్నా మాట్లాడుతూ రచ్చ తరువాత సంపత్‌నందితో ఈ సినిమాకు పనిచేయడం ఆనందంగా వుంది. రవితేజతో నటించాలన్న కోరిక ఈ సినిమాతో నెరవేరుతోంది. ఎప్పుడు షూటింగ్ మొదలవుతుందా అని ఎదురు చూస్తున్నా. రాశిఖన్నా మరో నాయికగా నటించనుంది అని తెలిపింది.
నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు
బొమన్ ఇరానీ, తనికెళ్ల భరణి, నాజర్, రావు రమేష్, షయాజీ షిండే, బ్రహ్మాజీ, పోసాని కృష్ణమురళి, దువ్వాసి మోహన్, నర్రా శ్రీనివాస్, సత్యం రాజేశ్, ప్రభాస్ శ్రీను, వెన్నెల రామారావు పవిత్రా లోకేష్,సురేఖా వాణి, పావలా శ్యామల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎస్. సౌందరరాజన్,, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: డి.వై. సత్యనారాయణ, లైన్ ప్రొడ్యూసర్: ఎం.ఎస్. కుమార్, నిర్మాత: కె.కె. రాధామోహన్, కథ-స్ర్కీన్ ప్లే-డైలాగ్స్-డైరెక్షన్: సంపత్ నంది.

About admin1

Comments are closed.

Scroll To Top
Social Media Auto Publish Powered By : XYZScripts.com