Sunday , 24 September 2017
Breaking News
You are here: Home » Tollywood » రాక్షసుడు సినిమా ఆడియో లాంచ్ హైలైట్స్:

రాక్షసుడు సినిమా ఆడియో లాంచ్ హైలైట్స్:

ShareShare on FacebookShare on Google+Tweet about this on Twitter

రాక్షసుడు సినిమా ఆడియో లాంచ్ హైలైట్స్:

 

rakshasudu

తమిళంలో స్టూడియో గ్రీన్ సంస్థ ‘మాస్’గా తెరకెక్కించిన ఈ రాక్షసుడు సినిమాని మిరియాల కృష్ణారెడ్డి, రవీందర్ రెడ్డి మేధా క్రియేషన్స్ పతాకంపై తెలుగులో అనువదిస్తున్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించి,సూర్య, నయనతార, ప్రణీత హీరో హీరోయిన్లుగా నటించిన రాక్షసుడు సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఈ సినిమాలో ‘సమ్మర్ మాస్’ అంటూ సాగే గీతానికి మరో సంగీత దర్శకుడు థమన్ సంగీతం అందించడం విశేషం. పలువురు సినీ ప్రముఖులు, అపార అభిమానగణం మధ్య నేడు శిల్పకళావేదికలో ఈ సినిమా పాటలు విడుదల అయ్యాయి.

ప్రముఖ తెలుగు కథానాయకుడు ప్రభాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి బిగ్ సీడీ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘వెంకట్ ప్రభు విభిన్న కథలను తెరకెక్కిస్తూ విజయాలను అందుకుంటున్నారని, ఈ సినిమా అందరినీ అలరిస్తుందని, సంగీత దర్శకుడు యువన్ పాటలంటే చాలా ఇష్టమని, అతనికి తెలుగులోనూ అభిమానులున్నారని, స్టూడియో గ్రీన్ సంస్థ తెలుగులోనే అతి పెద్ద సంస్థగా ఆవిర్భావిచిందని వారు నిర్మించిన ఈ సినిమా మంచి విజయం సాధించాలని’ కోరారు.
మరో అతిథిగా దర్శకుడు కోదండరామిరెడ్డి మాట్లాడుతూ ఇప్పుడు పెద్ద హీరోలుగా.. దర్శకులుగా పేరొందిన చాలామంది తనతో పాటుగా చెన్నైలోనే పెద్దవాళ్ళుగా చెలామణీ అయ్యామని, అక్కడి నుండి వచ్చిన సూర్య నేడు తెలుగులో ఇంతటి ప్రేక్షకాదరణ సొంతం చేసుకోవడం సంతోషించదగ్గ విషయమని ఈ సినిమా విజయం సాధించాలని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

హీరో సూర్య తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న అభిమానానికి కృతఙ్ఞతలు తెలుపుతూ తన గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాని ఆదరించాలని మంచి వినోదంతో థ్రిల్లర్ అంశాలతో ఈ సినిమా తెరకెక్కిందని చెప్పారు. కథలో మంచి ట్విస్ట్ లు వున్నాయని 29న థియేటర్లలో వస్తుందని తెలిపుతూ చిరంజీవి రాక్షసుడు సినిమాలనే ఈ సినిమాకి విజయం చేకూరుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇంకా ఈ కార్యక్రమంలో స్టూడియో గ్రీన్ అధినేత జ్ఞానవేల్ రాజా, దర్శకుడు వెంకట్ ప్రభు, నటులు శ్రీమాన్, ప్రేమ్ జీ, ముల్టీ డైమెన్షన్ వాసు, బన్నీ వాసు, యువన్ శంకర్ రాజ తదిరతులు పాల్గొన్నారు.

About admin1

Comments are closed.

Scroll To Top
Social Media Auto Publish Powered By : XYZScripts.com