LOADING

Type to search

వర్మ సావిత్రి వివాదాస్పదం

Home Movie News Recent Uncategorized

వర్మ సావిత్రి వివాదాస్పదం

admin1 October 4, 2014
Share

నిత్యం ఏదో ఒక వివాదం తో వార్తల్లో ఉండే సంచలన దర్శకులు రాం గోపాల్ వర్మ తాజాగా మరో వివాదాన్ని సృస్టించనున్నాడు. పతివ్రతా మూర్తి అయిన సావిత్రి ని తన సినిమాకి టైటిల్ గా పెట్టడమే కాకుండా ఆ పేరుతో చాలా వల్గర్ గా స్టిల్స్ తీయించి మీడియాకి వదిలాడు వర్మ. సావిత్రి పేరుతో ఓ ఆంటీ అందాలను ఓ కుర్రాడు తొంగి తొంగి చూస్తూ ఉన్న స్టిల్స్ చూస్తుంటే వర్మ ఎంతగా దిగజారి పోయాడో ఇట్టే అర్ధం అయిపోతోంది. ఇన్నాళ్ళు వర్మ ఓ క్రియేటర్ అని భ్రమ పడిన వాళ్ళకు తన నిజస్వరూపం ఇదేనని సినిమాలను తీసి యువత బలహీనతలను క్యాష్ చేసుకోవడమే తన పని అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు వర్మ. తెలుగు ప్రజలకు ఇష్టమైన సావిత్రి పేరుని ఓ చీప్ క్యారెక్టర్ కి పెడుతుండటం తో ఖచ్చితంగా అది వివాదాస్పదం అవుతుందని భావిస్తున్నారు సినీ విశ్లేషకులు. Savitri-First-look02

Tags:
Translate »