సోనాక్ష్ సిన్హా కూడా మెగా హీరోయిన్ గా మెగా కాంపౌండ్ లోకి ఎంట్రి !

0
ShareShare on FacebookShare on Google+Tweet about this on Twitter

బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సోనాక్షి సిన్హాకు తెలుగు సినిమాలపై ఎప్పటి నుంచో కన్ను వేసింది. అయితే చుక్కలను తాకే సోనాక్షి పారితోషికం తెలుసుకున్న మహేష్ బాబు సినిమా నిర్మాతలు కూడా సోనాక్షిని అందుకోలేక పోయారు.  ఆమధ్య ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా తనకు మహేష్ బాబుతో నటించాలని ఉందని తన ఆకాంక్షను వ్యక్త పరిచింది.  ఇది ఇలా ఉండగానే రేపు విడుదల కాబోతున్న ‘లింగ’ క్రేజ్ పెరిగి పోవడంతో టాలీవుడ్ లో సోనాక్షి క్రేజ్ మళ్ళీ మొదలైంది. రజినీకాంత్ సినిమాలను తెలుగు ప్రేక్షకులు బాగా చూస్తారు కాబట్టి ఈ సినిమా హిట్ అయితే సోనాక్షికి టాలీవుడ్ లో క్రేజ్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.  ఈ వార్తలు ఇలా ఉండగా సోనాక్షిని రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తూ వచ్చే సంవత్సరం నుండి షూటింగ్ ప్రారంభం కాబోతున్న సినిమాకు హీరోయిన్ గా ఎంపిక చేయడానికి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సోనాక్షికి ఉన్న క్రేజ్ రీత్యా ఆమె కోరుకునే భారీ పారితోషికాన్ని కూడా ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధ పడుతున్నట్లు టాక్.  అయితే గతంలో పవన్ కళ్యాణ్ తో‘గబ్బర్ సింగ్ 2’ సినిమాకు దర్శకత్వం వహిస్తాడు అనుకున్న సంపత్ నంది పవన్ పక్కన సోనాక్షి సిన్హాను ఆ సినిమాలో నటింపచేయడానికి చాల గట్టి ప్రయత్నాలే చేసాడు అనే వార్తలు అప్పట్లో వచ్చాయి. అయితే పారితోషిక విషయంలో సోనాక్షి చెప్పిన రేటుకు బెదిరి పోయి ఆ ఆలోచనలు అప్పట్లో సంపత్ నంది, పవన్ లు మొదట్లోనే వదులుకున్నారు అనే వార్తలు కూడా ఉన్నాయి.  అయితే పవన్ ఇష్టపడ్డ హీరోయిన్ ఆయనకు దక్కక పోయినా, అబ్బాయి రామ్ చరణ్ కు దక్కించుకున్నాడు అనే వార్తలు వస్తూ ఉండటంతో సోనాక్ష్ సిన్హా కూడా మెగా హీరోయిన్ గా మెగా కాంపౌండ్ లోకి ఎంట్రి ఇవ్వబోతోందనే అనుకోవాలి.

Share.

About Author

Comments are closed.