స్టార్ క్యాంపెయిన్

0
ShareShare on FacebookShare on Google+Tweet about this on Twitter

చివరి రోజు  జోరు.. హోరు..

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం చివరి రోజైన ఆదివారం  ప్రచార ‘స్టార్లు’ నగరాన్ని చుట్టేశారు. టీఆర్‌ఎస్ తరఫున  మంత్రి కేటీఆర్… బీజేపీ తరఫున ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి…  ఎంఐఎం తరఫున ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వివిధ ప్రాంతాల్లో ప్రచారం చేశారు. ర్యాలీలు… పాదయాత్రలలో పాల్గొన్నారు.  ఇంటింటికీ తిరిగి తమ పార్టీల అభ్యర్థులను  గెలిపించాల్సిందిగా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.  గ్రేటర్ ఎన్నికల్లో రెండో అంకానికి ఆదివారంతో తెరపడింది.

ఇరవై రోజుల పాటు వాడవాడలా.. ప్రతి ఇంటి తలుపును తట్టిన పార్టీల ప్రచార పర్వం ముగిసింది. చివరిరోజు  కావడంతో అధికార పార్టీ మంత్రులు, ఇతర పార్టీల ముఖ్యనాయకులు జోరు పెంచారు. బైక్ ర్యాలీలు, బహిరంగ సభలతో కాలనీలను హోరెత్తించారు.81454273337_625x300

Share.

About Author

Comments are closed.