LOADING

Type to search

స్టార్ గ్రూప్ వాటా మాటివిలో

Recent Tollywood

స్టార్ గ్రూప్ వాటా మాటివిలో

admin1 February 12, 2015
Share
ShareShare on FacebookShare on Google+Tweet about this on Twitter

మాటివి, స్టార్ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇప్పటి వరకు కేవలం ఉత్తరాదికే పరిమితమైన స్టార్ గ్రూప్ ఇప్పుడు దక్షిణ భారత్ లోకి అందులోను తెలుగులోకి అడుగుపెట్టింది. బుల్లితెర ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకతను సాధించుకుంది మాటివి.ఉత్తరాదిలో అనేక ఛానల్లను నడుపుతున్న స్టార్ గ్రూప్ తన వ్యాపార ప్రపంచాన్ని విస్తరించింది. తన షేర్లో కొన్నింటిని స్టార్ గ్రూప్ కు అమ్మడం ద్వారా మాటివిలో వాటా కొనుగోలు చేసింది స్టార్ గ్రూప్. మాటివి సియివో నిమ్మగడ్డ ప్రసాద్, మాటివి భాగస్వాములు అక్కినేని నాగార్జున, చిరంజీవి పాల్గొన్నారు. అయితే స్టార్ గ్రూప్ మాటివిలో కేవలం బిజినెస్ భాగస్వామి మాత్రమే అని స్టార్ గ్రూప్ ప్రకటించింది. కార్యక్రమాల నిర్వహణ లాంటి విషయాల్లో ఎలాంటి ప్రమేయం ఉండదని నిమ్మగడ్డ ప్రసాద్ వివరించారు.రేటింగ్స్ పరంగా కూడా ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అన్నింటి కన్నా మాటివి ముందుంది.ఇన్నాళ్లూ మాటీవి నిమ్మగడ్డ ప్రసాద్ ఛైర్మన్ గా ఉన్నారు. అలాగే నిమ్మగడ్డ ప్రసాద్ తో పాటు చిరంజీవి, అల్లు అరవింద్, నాగార్జున భాగస్వామ్యులు గానూ, డైరక్టర్లగానూ ఉన్నారు. స్టార్ నెట్ వర్క్ ప్రతినిథిలతో కలిసి బుధవారం మధ్యాహ్న ప్రెస్ మీట్ పెట్టి తమ ఒప్పందం గురించి ప్రకటించారు. సోనీటీవి , మాటీవీకు ఎలాంటి ఒప్పందాలు లేవని ఈ సందర్బంగా నిమ్మగడ్డ ప్రసాద్ స్పష్టత ఇచ్చారు. స్టార్, మా టీవి వాటాల వివరాలు ఇంకా తేలలదేని కూడా ఆయన అన్నారు. తెలుగు ప్రజలకు మరింత నాణ్యమైన ప్రసారాలు అందిస్తామని పేర్కొన్నారు

Tags:
Translate »