LOADING

Type to search

హృతిక్ రోషన్ పై పోలీసులకు ఫిర్యాదు

Bollywood Movie News Recent

హృతిక్ రోషన్ పై పోలీసులకు ఫిర్యాదు

admin1 April 7, 2016
Share

ముంబై: బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, కంగనా రౌనత్ మధ్య వివాదం ముదురుతోంది. పరస్పరం లీగల్ నోటీసులతో కోర్టుకెక్కిన ఈ వివాదం మరో మలుపు తిరిగింది. తన మాజీ ప్రియుడిపై ‘క్వీన్’ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనుమతి లేకుండా తన వ్యక్తిగత ఈ-మెయిల్స్, ఫొటోలు బయటపెడుతున్నారని ఆరోపించింది. ఈ మేరకు ముంబై పోలీసు కమిషనర్ కు కంగనా తరపు న్యాయవాది రిజ్వాన్ సిద్ధిఖీ లిఖితపూర్వంగా ఫిర్యాదు చేశారు. తన క్లైంట్ కు సంబంధించిన వ్యక్తిగత ఈ-మెయిల్స్, ఫొటోలను ఆమె అనుమతి లేకుండా బయటపెట్టిన హృతిక్ రోషన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.

ఈ ఏడాది ఆరంభంలో హృతిక్, కంగనా వివాదం మొదలైంది. హృతిక్ తన మాజీ ప్రియుడని కంగనా వెల్లడించడం, దాన్ని అతడు ట్విటర్ లో ఖండించడంతో వివాదం రాజుకుంది. తర్వాత ఇద్దరూ పరస్పరం లీగల్ నోటీసులు పంపుకున్నారు. ఈ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనబడడం లేదని బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.61460028469_625x300

Next Up

Translate »