LOADING

Type to search

హ్యాపీ బర్త్ డే టు ఎన్.టి.ఆర్

Tollywood

హ్యాపీ బర్త్ డే టు ఎన్.టి.ఆర్

admin1 May 20, 2015
Share

హ్యాపీ బర్త్ డే టు ఎన్.టి.ఆర్

jr ntr and son

హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ మే 20తో 31 సంవత్సరాలు పూర్తి చేసుకుని 32వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. ఈ సందర్భంగా జూ ఎన్టీఆర్ తన కొడుకు అభయ్ రామ్ ఫోటోలు విడుదల చేసారు. చిన్న తనంలో ఎన్టీఆర్ ఎలా ఉన్నాడో అచ్చం అలానే జిరాక్స్ కాపీ లాగా అభయ్ రామ్ ఉండటం గమనార్హం. పుట్టిన రోజు సందర్భంగా జూ ఎన్టీఆర్ గురించిన సినిమా సంగతులను నెమరు వేసుకుంటూ అతనికి సంబంధించిన చిన్ననాటి ఫోటోలపై ఓ లుక్కేద్దాం. విశ్వవిఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు మనవడైన జూ ఎన్టీఆర్ మే 20, 1983న జన్మించాడు. తండ్రి నందమూరి హరికృష్ణ, తల్లి షాలిని. అంతా అతన్ని ముద్దుగా తారక్ అని పలుస్తుంటారు. చిన్నతనం నుండే నటనపై ఆసక్తిపెంచుకున్న తారక్ మొదట కూచిపూడి నృత్యంలో శిక్షణ పొందాడు. తారక్ లోని కళాభిమానానికి ముగ్ధులైన ఎన్టీఆర్ బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రములో బాలనటునిగా తెలుగు చిత్రసీమకు పరిచయం చేశారు.ఈ సంవత్సరం ‘టెంపర్’ తో సక్సెస్ అందుకున్న ఎన్.టి.ఆర్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడు. జూ ఎన్టీర్ చిన్నతనంలో అలానే, చిలిపిగా1/11 జిరాక్స్ కాపీ ఈ ఫోటోచూస్తుంటే ఎన్టీఆర్, అభయ్ రామ్ జిరాక్స్ కాపీలా ఉన్నారు కదూ.

Translate »