LOADING

Type to search

హ్యాపీ బర్త్ డే టు యు రామ్:

Tollywood

హ్యాపీ బర్త్ డే టు యు రామ్:

admin1 May 15, 2015
Share

హ్యాపీ బర్త్ డే టు యు రామ్:

ram

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ తన సినిమాలతో ప్రేక్షకుల మదిలో చెరిగిపోని ముద్ర వేసుకున్నాడు. తన నటన మరియు అదిరిపోయే డాన్స్ లతో లేడీ ఫాలోయింగ్ కూడా పెంచుకున్నాడు. “దేవదాసు”, “జగడం”, “మస్కా”, “కందిరీగ” వంటి సినిమాలతో యూత్ ప్రేక్షకులకి చేరువయ్యాడు. అయితే ఈ మధ్య కాలంలో హిట్స్ లేక కొంచెం స్లో అయ్యాడనే చెప్పాలి. ‘గణేష్’, ‘రామ రామ కృష్ణ కృష్ణ’ అని టైటిల్స్ పెట్టుకున్నా ఏ దేవుడూ రామ్ కు సాయం చేయలేదు. ‘కందిరీగ’లా జోరున తిరిగితే ఒక విజయం వచ్చింది. సినిమా మీద ప్రేమతో ‘ఎందుకంటే ప్రేమంట’ లాంటి క్లాస్ కథలు చేసినా ఫలితం మారక ‘ఒంగోలు గిత్త’గా కనపడ్డాడు. కారణాలేవైనా ఫలితం మారలేదు. ఫుల్ మాస్ ‘మసాలా’తో అతి త్వరలో మనముందుకు వస్తున్న రామ్ సినిమా అతను ‘పండగ చేస్కో’నేలా వుండాలని ఆశిద్దాం
“పండగ చేస్కో” చిత్రంలో రామ్ కి జంటగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది మరి ఈ సినిమాతో రామ్ మంచి హిట్ కొట్టాలని ఆశిస్తూ “ఆంధ్రవిలాస్” జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది.

Translate »