Monday , 20 November 2017
Breaking News
27
You are here: Home » Tag Archives: telangana

Tag Archives: telangana

Feed Subscription

“తెలంగాణా సినీ స్వర్ణకమలం” అవార్డు తో సత్కరించారు

తెలంగాణా మలిదశ ఉద్యమంలో సినీ రంగం నుండి ముందునుండి పాల్గొని , ఇంకెన్నాళ్ళు సినిమాలో తెలంగాణా ఆత్మను ఆవిష్కరించి తెలంగాణా తల్లి విముక్తి కోసం తన సినీ కారియర్ ని సైతం లేక చేయకుండా ముందువరసలో ఉండి పోరాడిన “సయ్యద్ రఫీ” గారు ,అయన తెలంగాణా సినిమా కోసం చేసిన కృషికి నేడు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ చేతులమీదుగా “తెలంగాణా సినీ స్వర్ణకమలం” అవార్డు తో సత్కరించారు. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా తప్పకుండా త్వరలోనే అతని ప్రతిభని ,త్యాగాన్ని మరియు సంకల్పాన్ని ... Read More »

రాష్ట్రాలే వెరుపడ్డాక ఉమ్మడి సినిమా సంఘాలు అవసరమా ?

రాష్ట్రాలే వెరుపడ్డాక ఉమ్మడి సినిమా సంఘాలు అవసరమా ? అయ్యి,యాడ పోతే మనకేంది , ఎవ్వల్లు గెలిస్తే మనకేంది ? పోనీ, తెలంగాణా వాడు అద్యక్ష పదవికి నిలబడి గెలిచిండా అంటే అదికూడా లేదు ! మన లో బానిస మనస్తత్వం , అమాయకత్వం ఉందని రుజువు అవుతున్నది మీ అల్పసంతోషం చూస్తుంటే ! అందుకేనేమో మనలను బెవఖుఫ్ లను చేసి రాష్ట్రము వేరుపడ్డాక కూడా పబ్బం గడపడమే కాకుంట ఈ ఉమ్మడి సంఘాలను అట్లనే కొనసాగించి, దొబ్బింది చాలక 2000 ఎకరాలపై గురి ... Read More »

కేసీఆర్ కాన్వాయ్ లో ఓ అధునాతన బుల్లెట్ ప్రూఫ్ వాహనం

తాజాగా కేసీఆర్ కాన్వాయ్ లో ఓ అధునాతన బుల్లెట్ ప్రూఫ్ వాహనం చేరింది. దానిలో ఆరుగురు మెరికల్లాంటి సిబ్బంది కూడా ఉంటారు. ఎలాంటి దాడినయినా తిప్పికొట్టడంలో వారు ప్రత్యేక శిక్షణ పొందిన వారు. నల్గొండ జిల్లా లో ఉగ్రవాదుల కార్యకలాపాలు, ఎన్కౌంటర్ ల నేపధ్యం లో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు భద్రత మరింత పెంచారు. కెసిఆర్ ప్రయాణించే వాహన శ్రేణి లో అస్త్రాలతో కూడిన సరికొత్త స్కార్పియో తెలుపు రంగు వాహనాన్ని అధికారులు చేర్చారు.గతంలో ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ కొనసాగే సమయంలో ఉపయోగించిన ... Read More »

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య సివిల్ అధికారుల విభజన

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య సివిల్ అధికారుల విభజన ప్రక్రియ పూర్తయింది. డిసెంబర్ 26వ తేదీన ఇచ్చిన ప్రొవిజినల్ జాబితా అనంతరం అధికారుల అభ్యంతరాలను పరిశీలించిన డీవోపీటీ తుది జాబితాను గురువారం ప్రకటించింది. తెలంగాణకు 133 మంది ఐఏఎస్‌లు, 95 ఐపీఎస్‌లు, 58 ఐఎఫ్‌ఎస్ అధికారులను కేటాయించారు. ప్రొవిజినల్ జాబితాలో తెలంగాణకు కేటాయించిన నలుగురు ఐఏఎస్ అధికారుల్లో శాంతకుమారి తప్ప వీ కరుణ, ఎం ప్రశాంతి, ఏ వాణీప్రసాద్‌లు తుది జాబితాలో ఆంధ్రప్రదేశ్‌కు దక్కారు. అలాగే ఏపీకి కేటాయించిన ఐపీఎస్ అధికారి మహేష్ భగవత్ తుది ... Read More »

పిడికెడు బొగ్గులేని ఆంధ్రలో మిగులు విద్యుత్తా?

పిడికెడు బొగ్గులేని ఆంధ్రలో మిగులు విద్యుత్తా? -పుష్కలంగా వనరులున్న తెలంగాణలో సంక్షోభమా…………..-కేంద్ర మంత్రి పీయూష్‌ను నిలదీసిన ఎంపీ వినోద్ పిడికెడు బొగ్గు కూడా దొరకని ఆంధ్రప్రదేశ్‌లో మిగులు విద్యుత్తు ఉండగా.. పుష్కలంగా బొగ్గు నిక్షేపాలున్న తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కొరత ఎలా ఉంటుంది..? అని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్‌ను టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ కుమార్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అవసరాలపై కేంద్రం తీసుకుంటున్న చర్యలేమిటని నిలదీశారు. గురువారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయం సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ పదేపదే తెలంగాణ ... Read More »

తెలంగాణ తొలి శాంతిదూతగా ప్రొఫెసర్ కోదండరాం

(తెలంగాణ తొలి శాంతిదూతగా ప్రొఫెసర్ కోదండరాం).తెలంగాణా ఉద్యమ రోజుల్లో కీలక పాత్ర పాత్ర వహించిన వారిలో ప్రొఫెసర్ కోదండరాం గారుప్రముకులు . అయితే ఉద్యమానికి ముందు ఆయన విద్యావంతుల వేదిక పేరుతో ఓ సంఘం పెట్టి సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను చర్చకు పెట్టేవాడు. ఇక తెలంగాణా ఉద్యమం సమయంలో తెలంగాణ సమాజాన్ని ఏకతాటిపై నడిపాడు. రాజకీయాలకతీతంగా అన్ని వర్గాలను ఏకంచేసి.తెలంగాణ ఉద్యమాన్ని భుజానవేసుకున్నాడు,పార్టీలకు అతీతంగా సాగరహరం వంటి బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని నిర్వహించారు, వరంగల్ లోని వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతి ... Read More »

మన ముఖ్యమంత్రి కె సి ఆర్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

దశాబ్దాలుగా లేస్తూ, పడిపోతూ .. నివురుగప్పిన నిప్పులా ఉన్న తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసి నింగిని అంటుకొనేలా రగిల్చిన ఒకే ఒక్క ఉద్యమనాయకుడు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, మన ముఖ్యమంత్రి కె సి ఆర్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు! Happy birthday to our Telangana Lion and Our Cheif Minister Kalvakuntla Chandrashekarao Garu May God bless you with health ,wealth and prosperity. Read More »

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు మార్చి 21 నుంచి

స్వరాష్ట్రంలో తొలిసారిగా బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు రూ.1కోటి వ్యయంతో ఏర్పాట్లు చేపట్టనున్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో శ్రీవసంతప్రయుక్త నవాహ్నిక శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు మార్చి 21 నుంచి ఏప్రిల్ 3 వరకు నిర్వహించనున్నారు.శ్రీరామనవమి వేడుకలకు గవర్నర్‌తోపాటు ముఖ్యమంత్రి కూడా హాజరవనున్నారు. ముఖ్యమంత్రి, గవర్నర్ సెక్టార్‌లో ఏసీ, భక్తుల సౌకర్యార్థం కూలర్లు, ఫ్యాన్లు, ఎల్‌ఈడీలు ఏర్పాటు చేస్తున్నారు. పోలీసుశాఖ సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తున్నది. మార్చి 21 ఉగాది పండుగ పంచాంగ శ్రవణం, 24న ఉత్సవాలకు అంకురారోపణ, 25న గరుడ దివాసం, ... Read More »

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పై టిడిపి వివాదం సృష్టిస్తోంది.

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కులంపై టిడిపి వివాదం సృష్టిస్తోంది. టిడిపి సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు మాట్లాడుతూ కడియం శ్రీహరి బిసి అని,ఆయన తల్లిదండ్రులు బిసివర్గానికి చెందినవారని ఆరోపించారు. కోటి మంది దళితులు తెలంగాణలో ఉంటే ఒక్కరికి కూడా మంత్రి పదవి ఇవ్వరా అని ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు.తప్పుడు పత్రాలతో పోటీ చేశారంటూ టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు చేసిన ఆరోపణలను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఖండించారు. రాజయ్యను పదవి నుంచి తొలగించడం దళితులను అవమానించడమేనని అన్నారు.శ్రీహరికి పదవి ... Read More »

ఇండియన్ ఆఫ్ ద ఇయర్-2014 కేసీఆర్‌

సీఎన్‌ఎన్-ఐబీఎన్ సంస్థ ఇండియన్ ఆఫ్ ద ఇయర్-2014 పేరిట ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్న ఓటింగ్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ 31 శాతం ఓట్లు సంపాదించి దేశంలో ప్రథమ స్థానంలో నిలిచారు. ప్రఖ్యాత సినీనటులు, జాతీయ నేతలను అధిగమించి ఆయన ఈ స్థానం చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ మర్యాదపూర్వక భేటీ జరిగింది.సుప్రసిద్ధ టీవీ చానెల్ సీఎన్‌ఎస్-ఐబీఎన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీవాస్తవ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును మంగళవారం సచివాలయంలో కలుసుకున్నారు. తమ సంస్థ తరపున ఆయన సీఎంకు అభినందనలు తెలియజేశారు. Read More »

Scroll To Top
Social Media Auto Publish Powered By : XYZScripts.com