Thursday, January 09
Breaking News:

కిషన్‌ రెడ్డి అధ్యక్షత కౌన్సిల్‌ సమావేశం ప్రారంభం ఎన్నికల సన్నద్ధత,జాతీయ నేతల సభలపై చర్చ

1696577041_2022_7$largeimg_450510083.jfif

అసెంబ్లీ ఎన్నికల దగ్గరపడుతుండటంతో బీజేపీ అధిష్టానం స్పీడ్‌ పెంచింది.క్షేత్రస్థాయిలో ప్రజలను ఆకట్టుకునేలా ముందుకెళ్లేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. మోదీ పర్యటనతో వచ్చిన జోష్ ని కంటిన్యూ చేసేలా కసరత్తు చేస్తున్నారు. తాజాగా 
పదాధికారుల సమావేశం నిర్వహించిన టీబీజేపీ.. ఇవాళ కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటు చేసింది.

తెలంగాణ బీజేపీ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్‌ రెడ్డి అధ్యక్షత నిర్వహిస్తున్న ఈ సమావేశానికి.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ నేతలు బీఎల్ సంతోష్, సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, రాష్ట్ర ముఖ్యనాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.నిన్న పదాధికారుల సమావేశంలో పలు వ్యూహాలపై, తీర్మానలపై చర్చించిన రాష్ట్ర నేతలు.. కౌన్సిల్‌ సమావేశంలో ఆయా తీర్మానాలను ఆమోదించనున్నారు.
అదేవిధంగా ఎన్నికల సన్నద్ధత, బీజేపీ జాతీయ నేతల సభలపై చర్చించనున్నారు. జేపీ నడ్డా, బీఎల్ సంతోష్‌ రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. 

 ఇదిలా ఉండగా రాష్ట్రంలో జాతీయ నేతల పర్యటనకు టీబీజేపీ ప్లాన్‌ చేస్తోంది.ఈ నెల 10న కేంద్ర హోంశాఖ మంత్రి రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ నెల 27న మరోసారి షా రాష్ట్రానికి వస్తున్నారు. ఆ రోజు కుత్బుల్లాపూర్ లేదా రాజేంద్ర నగర్​లో నిర్వహించే సభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ నెల 20, 21 తేదీల్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌.. రాష్ట్రంలో రెండ్రోజులు పర్యటించనున్నారు. అధికారమే లక్ష్యంగా గులాబీ దండుపై.. బీజేపీ జాతీయ నాయకత్వం దండ యాత్రకు సిద్ధం కావడంతో పాటు.. అగ్ర నేతల పర్యటనలతో నిస్తేజంలో ఉన్న బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంటోంది.

టీబీజేపీ చీఫ్ కిషన్‌ రెడ్డి అధ్యక్షతన బీజేపీ కౌన్సిల్ సమావేశం ప్రారంభం
ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా 
పాల్గొన్న బీఎల్‌ సంతోష్ - సునీల్ బన్సల్ - తరుణ్ చుగ్
రాష్ట్రనేతలకు దిశానిర్దేశం చేయనున్న నడ్డా-సంతోష్
ఎన్నికల సన్నద్ధత - బీజేపీ జాతీయ నేతల సభలపై చర్చ
రాష్ట్రంలో జాతీయ నేతల పర్యటనలకు ప్లాన్‌
ఈ నెల 10న తెలంగాణకు హోంమంత్రి అమిత్‌షా
ఆదిలాబాద్‌ బహిరంగ సభలో పాల్గొననున్న షా
ఈ నెల 27న మరోసారి రాష్ట్రానికి రానున్న షా
కుత్బుల్లాపూర్ లేదా రాజేంద్రనగర్​లో సభ
నెలాఖరుల్లో కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ పర్యటన
20- 21 తేదీల్లో రాజ్‌నాథ్‌ సింగ్‌ పర్యటన

హైదరాబాద్, టీబీజేపీ చీఫ్ కిషన్‌ రెడ్డి అధ్యక్షతన బీజేపీ కౌన్సిల్ సమావేశం ప్రారంభం
హైదరాబాద్, ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా 
హైదరాబాద్, పాల్గొన్న బీఎల్‌ సంతోష్ - సునీల్ బన్సల్ - తరుణ్ చుగ్
హైదరాబాద్, రాష్ట్రనేతలకు దిశానిర్దేశం చేయనున్న నడ్డా-సంతోష్
హైదరాబాద్, ఎన్నికల సన్నద్ధత - బీజేపీ జాతీయ నేతల సభలపై చర్చ
హైదరాబాద్, రాష్ట్రంలో జాతీయ నేతల పర్యటనలకు ప్లాన్‌
హైదరాబాద్, ఈ నెల 10న తెలంగాణకు హోంమంత్రి అమిత్‌షా
హైదరాబాద్, ఆదిలాబాద్‌ బహిరంగ సభలో పాల్గొననున్న షా
హైదరాబాద్, ఈ నెల 27న మరోసారి రాష్ట్రానికి రానున్న షా
హైదరాబాద్, కుత్బుల్లాపూర్ లేదా రాజేంద్రనగర్​లో సభ
హైదరాబాద్, నెలాఖరుల్లో కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ పర్యటన
హైదరాబాద్, 20- 21 తేదీల్లో రాజ్‌నాథ్‌ సింగ్‌ పర్యటన

 

Prev Post ఐదు రాష్ట్రాల అసెంబ్...
Next Post పాఠశాల్లో సీఎం బ్రేక...

More News