Thursday, January 09
Breaking News:

క్యాన్సర్ కంటే ముఖ్యమంత్రి కేసీఆరే డేజరని - కరీంనగర్ ఎంపీ బండి సంజయ్

1692859590_bsp.jpg

క్యాన్సర్ కంటే ముఖ్యమంత్రి కేసీఆరే డేజరని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఎద్దేవ చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గ మండలం లోని సి హెచ్ ఆర్ గార్డెన్ లో  జితేందర్ రెడ్డి అధ్యక్షతన బుధవారం జరిగిన భూత్ సమ్మేళనం సమావేశం లో ముఖ్య అతిథిగా బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి, కర్ణాటక ఎమ్మెల్యే చంద్రప్ప,మాజీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తో పాటు  ఆయన పాల్గొన్నారు. చెవుల నియోజకవర్గంలోని ఐదు మండలాల బిజెపి కార్యకర్తలతో సమావేశం  గజమాలతో స్వాగతం పలికారు.. బండి సంజయ్ మాట్లాడుతూ క్యాన్సర్ మూడోదశకు చేరితే ఎంత డేంజరో... కేసీఆర్ మూడోసారి సీఎం అయితే అంతకంటే డేంజరని,నట్టేట ముంచిన బీఆర్ఎస్‌కు ఓటేస్తారా? మీకోసం ఉద్యమాలు చేసి జైళ్లకు పోతున్న బీజేపీకి ఓటేస్తారా కేసీఆర్‌ను తరిమి తరిమికొట్టి రామరాజ్యం తేవడమే బీజేపీ లక్ష్యంగా ప్రతి బీజేపీ కార్యకర్త కృషి చెయ్యాలని సీఎం కేసీఆర్ దంతా పెగ్గుల భాగోతమే. పెగ్గుకొక మాట చెప్తారని విమర్శించారు.
 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి హాజరుకాలేడని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు పూలమాల వేసిన పాపానా పోలేడని, దళిత ముఖ్యమంత్రి చేస్తానని మూడెకరాల పొలం ఇస్తానని మోసం చేసిన ఘనత కేసిఆర్ కే దక్కుతుందని విమర్శించారు 
రానున్న ఎన్నికలలో చేవెళ్ల నియోజకవర్గం లో బీజేపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచెయ్యాలని తెలిపారు.

Prev Post అత్యంత అవినీతి పార్ట...
Next Post గోషామహల్ టికెట్ అడిగ...

More News