మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో మంత్రులు సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పర్యటించారు. మాచారం వద్ద నిర్వహించిన గిరిజన సదస్సులు అట్టహాసంగా జరిగింది. బాలానగర్ లోని పెద్దపల్లి చౌరస్తా వద్ద నిర్మించిన ఎస్టీ కమ్యూనిటీ హాల్, 2 కోట్ల రూపాయలతో నిర్మించిన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మరో 2 కోట్ల రూపాయల విలువైన బంజారా నిర్మాణ పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు మంత్రులు. ఇక గిరిజన తండాలను, దశాబ్ధాలుగా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా చేశామన్నారు. దీంతో బీటీ రోడ్లు, తాగునీటి వసతి నిరంతర విద్యుత్ సరఫరా అందుతుంటూ హర్షం వ్యక్తం చేశారు మంత్రి సత్యవతి రాథోడ్. 6శాతం ఉన్న గిరిజన రిజర్వేషన్ ను క10 శాతం పెంచిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్