తెలంగాణలో ఎన్నికలపై శాసనమండలి ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ప్రజాస్వామ్యాన్ని చంపేలా కేంద్రం కుట్రల చేస్తుందని గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.జమిలి ఎన్నికల పేరుతో కేంద్రం గందరగోళం సృష్టిస్తోందిని విమర్శించారు.ఎన్నికలు దగ్గర పడ్డాయంటూ ప్రజలను విపక్షల నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మూడో సారి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ షర్మిల లాంటి సమైక్యవాదులు రాష్ట్రంలో చొరబడ్డారన్నారు. తెలంగాణా వ్యతిరేకులంతా ఏకమవుతున్నారన్నారు. కాంగ్రెస్ నేతలు జానా, కోమటిరెడ్డి, ఉత్తమ్ తలా ఒకదారి ఎంచుకున్నారని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు.