Thursday, January 09
Breaking News:

టిఆర్ఎస్ పార్టీ నాంపల్లి ఎమ్మెల్యే సీటును ముదిరాజులకుకేటాయించాలి

1692859121_nampally.jpg

తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సంఖ్య లొ వున్న ముదిరాజులకు  ఎమ్మెల్యే సీట్ల కేటాయింపు లొ సముచిత  స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేసిన నాంపల్లి టిఆర్ఎస్ నాయకుడు కోమల రవి ముదిరాజ్. ఈ మేరకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటివరకు ప్రకటించిన 115 స్థానాలలో ముదిరాజ్ అభ్యర్థులు లేరని... దీన్ని దృష్టిలోపెట్టుకొనిప్రకటించని నాలుగు స్థానాలను ముదిరాజులకుకేటాయించాలని కోమల రవి విజ్ఞప్తి చేశారు. ముదిరాజ్ లు ప్రతి ఎన్నికల్లోటీఆరెఎస్ పార్టీ ని గెలిపిస్తున్నారన్నారు. అయినప్పటికీ ప్రతి సారి ముదిరాజ్ లకు అన్యాయం జరుగుతుందాన్నారు. ముదిరాజ్ లకు న్యాయం జరగాలంటే నాంపల్లి నియోజగవర్గాన్ని ముదిరాజ్ లకు కేటాయించాలని కోరారు. పార్టీ ఆవిర్భావం నుండి సేవ చేస్తున్న తనకు ఈ స్థానాన్ని కేటాయించాలని రవి ముదిరాజ్ విన్నవించారు.నాంపల్లి నియోజకవర్గం లోని ముదిరాజ్ లు ఎల్లా వేళల కేసీఆర్ సారద్యం లొ టీఆరెఎస్ పార్టీకి మదద్దు గా ఉంటారని ప్రకటించారు. ముదిరాజ్ సంఘ అభిరుద్ది కోసం, నియోజకవర్గం ప్రజలకు విశేష సేవలు అందుస్తు ప్రజల మన్ననలు పొందిన రవి ముదిరాజ్ కు నాంపల్లి సీటు ను కేటాయించాలని శాంతి ప్రియ, అనినాష్ , కృష్ణ,వినోద్ ముదిరాజ్ లు కేసీఆర్ ను కోరారు.

Prev Post హుటాహుటిన అమెరికా వె...
Next Post అత్యంత అవినీతి పార్ట...

More News