తుక్కుగూడలో ఈ నెల17న కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సభకు పార్టీ అగ్రనాయకురాలు సోనియాగాంధీ హాజరుకానున్నారు. ఈ వేదిక మీదే మేనిఫెస్టోను ప్రకటించాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నది. అదే స్టేజీపై మైనార్టీ, బీసీ, మహిళా డిక్లరేషన్లు సైతం అనౌన్స్ చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన మైనార్టీ, బీసీ, మహిళా విభాగాలు.. ప్రజలు, మేధావులు, కుల సంఘాలతో చర్చిస్తున్నాయి. ఈ మూడు కమిటీలు ఫైనల్ చేసిన తర్వాత వివరాలను ఢిల్లీకి పంపనున్నారు. ఆ తర్వాత ఓవరాల్ మ్యానిఫెస్టోలోనూ ఈ అంశాలను క్రోడీకరించనున్నారు. బీసీ డిక్లరేషన్‌ను ఐదు ప్రధాన అంశాలతో ప్రకటించనున్నారు. విద్యారంగం, వైద్య రంగం, ఆర్థిక సాయం, రాజకీయాల్లో ప్రాధాన్యత, ఎంప్లాయిమెంట్‌ను ఇందులో పొందుపరచనున్నారు.