తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చిన సిద్ధంగా ఉన్నామని మంత్రి హరీష్ రావు అన్నారు. ఓటమి భయంతోనే జమిలికి బీజేపీ ప్లాన్ చేసిందని, జనాన్ని నమ్ముకున్న బీఆర్ఎస్ పార్టీకి జమిలి ఎన్నికలతో నష్టం లేదని చెప్పారు. కుట్రతోనే ఎమ్మెల్సీ కవితను ఇబ్బంది పెట్టేందుకు బీజేపీ ప్రయత్నచేసిందని, కానీ తమకు కోర్టులపై న్యాయం, ధర్మం మీద నమ్మకముందన్నారు. ధర్మం.. న్యాయం గెలుస్తదన్నారు.