Thursday, January 09
Breaking News:

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. చంద్రయాన్‌ ల్యాండింగ్‌ నేపథ్యంలో

1692767784_c3.jpg

యావత్‌ ప్రపంచం చంద్రయాన్‌ 3 ల్యాండింగ్‌ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. జాబిలిపై ఉన్న గుట్టును ప్రపంచానికి చెప్పేందుకు పయనమైన చంద్రయాన్‌ 3 బుధవారం సాయంత్రం మూన్‌పై ల్యాండ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. దీంతో ఈ అపురూప దృశ్యాన్ని వీక్షించేందుకు అందరూ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ అద్భుత ఘట్టాన్ని ప్రజలంతా లైవ్‌లో వీక్షించేందుకు వీలుగా ఇప్పటికే నాసా లైవ్‌ స్ట్రీమింగ్ కోసం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

తెలంగాణలో బుధవారం స్కూళ్లు సాయంత్రం 6.30 గంటలకు పనిచేయనున్నాయి. ఈ విషయమై తెలంగాణ విద్యాశాఖ డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. లైవ్‌ స్ట్రీమింగ్ కోసం అన్ని స్కూళ్లలో ప్రత్యేక ఏర్పా్ట్లు చేయాలని ఆదేశించింది. సాయంత్రం 5.30 గంటల నుంచి 6.30 గంటల వరకు చంద్రయాన్‌ ల్యాండింగ్‌కు సంబంధించి లైవ్‌ వీడియోను స్కూల్స్‌లో స్ట్రీమింగ్ చేయనున్నారు. అంతరిక్ష రంగంలో భారత్‌ సరికొత్త చరిత్రను లికించడానికి చేపట్టిన ఘట్టాన్ని విద్యార్థులు వీక్షించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

Prev Post కమ్యూనిస్టుల సత్తా ఏ...
Next Post బెల్ట్ షాపుల రహిత ,...

More News