తెలంగాణ రాజకీయాల్లో సెప్టెంబర్ 17సెగ రాజుకుంది. అధికార, ప్రతిపక్షాలన్నీ.. బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించాయి. బీజేపీ హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో సభ నిర్వహిస్తోంది. ఇందుకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వస్తున్నారని తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ తెలంగాణ స్వాతంత్య్ర దినోత్సవం పేరుతో వేడుకలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తుంది. మరోవైపు బీఆర్‌ఎస్ కూడా.. జాతీయ సమైక్యతా దినోత్సవం పేరుతో కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. మూడు పార్టీల పోటాపోటీ సభలతో... సెప్టెంబర్ 17న.. ఏం జరగబోతోందన్న టెన్షన్ రాజకీయ వర్గాల్లో నెలకొంది.