Thursday, January 09
Breaking News:

నిరంతరాయంగా కొనసాగుతున్న కిషన్‌రెడ్డి దీక్ష

1694673336_q1.jpg

కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేపట్టిన నిరాహార దీక్షను పార్టీ కార్యాలయంలో కొనసాగిస్తున్నారు. కిషన్‌ రెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేసినా కార్యకర్తలతో కలిసి పార్టీ ఆఫీసులో కొనసాగిస్తున్నారు.

 బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నిరాహార దీక్ష కొనసాగుతోంది. నిరుద్యోగులను కెసిఆర్ మోసం చేస్తోందని ఆరోపిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్కరోజు నిరసనకు దీక్ష చేపట్టారు. అయితే అనుమతించిన గడువు ముగిసిందంటూ ఉద్రిక్తతల మధ్య కిషన్‌ రెడ్డిని అరెస్ట్ చేసి ఇందిరా పార్క్ నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి తరలించారు.దీంతో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 20 గంటలుగా కిషన్‌ రెడ్డి దీక్షను కొనసాగిస్తున్నారు. కిషన్‌ రెడ్డికి నిరుద్యోగ యువతతో పాటు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున సంఘీభావం తెలిపారు. బుధవారం రాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బీజేపీ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.

Prev Post రాజమండ్రి చేరుకున్న...
Next Post తెలుగు రాష్ట్రాలకు మ...

More News