Thursday, January 09
Breaking News:

పాలేరు నియోజకవర్గంలో బహుజన రాజ్యం - బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

1694951841_asasa.jpg

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో బహుజన రాజ్యం నిర్మిస్తామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్అన్నారు.ఆదివారం కూసుమంచి మండల కేంద్రంలోని విజయ రామ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన పాలేరు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..  తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం అవినీతికి ముందంజలో,అభివృద్ధికి ఆమడ దూరంలో ప్రయాణం చేస్తుందని దుయ్యబడ్డారు.  రాష్ట్రంలో అభివృద్ధి పేరుతో అవినీతి అక్రమాలకు బీఆర్ఎస్ పార్టీ నిలయంగా మారిందని, దీనిని ప్రజలందరూ గమనిస్తూ కెసిఆర్ బహిరంగ సభలకు రాకుండా నిరాకరిస్తున్నారని అందుకు నిదర్శనమే మొన్న జరిగిన మహబూబ్ నగర్ జిల్లా, కొల్లాపూర్ బహిరంగ సభయే నిదర్శనం అన్నారు. ఖమ్మం జిల్లాలో రవాణా శాఖ మంత్రిగా కొనసాగుతున్న పువ్వాడ అజయ్ కుమార్ మైనింగ్ మాఫియాగా మారి వందల కోట్ల రూపాయలు అక్రమ అర్జన చేస్తున్నారని విమర్శించారు. మంత్రి పువ్వాడ బీఎస్పీ కార్యకర్తలు నాయకులు సామరస్యంగా రోడ్లపై ధర్నాలు చేస్తుంటే కక్ష కట్టి వారిపై అక్రమ కేసులు బనాయించడం సరి కాదు అన్నారు. ఖమ్మం జిల్లాలో రైతులకు బేడీలు వేసిన చరిత్ర బీఆర్ఎస్ కె దక్కుతుందన్నారు.పాలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కందాళ అనుచరులు నియోజకవర్గంలో ఖమ్మం రూరల్ మండలంలో ఎంపీపీ భూ దందాలు అక్రమార్జనలే ధ్యేయంగా పనిచేస్తున్నారని ఎమ్మెల్యే కందాళ ఒక దళిత బందును మూడు నుంచి ఆరుగురికి పంచటం సిగ్గుచేటు అన్నారు.  సూర్యాపేట జిల్లా మంత్రి గుంట కండ్ల జగదీష్ రెడ్డి వడ్డే జానయ్య యాదవ్ భార్యాభర్తల పై కక్ష సాధింపు చర్యలో భాగంగా వారు ఈరోజు అజ్ఞాతం లోకి వెళ్లారన్నారు. కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాల కాలంలో ఏం చేసిందో ఎవరికి తెలియడం  లేదని ఈనాటికి దేశంలో రాష్ట్రాలు, జిల్లాలు, గ్రామాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండి కొట్టుమిట్టాడుతున్నాయని, ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసిందేమీ లేదన్నారు.  రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ లకు 50 శాతం సీట్లు ఇస్తామన్నారు. ఆదివాసీలు సాగు చేసుకుంటున్నా పోడు భూములకు కొన్ని పట్టాలు మాత్రమే ఇచ్చి ఆదివాసీలను ఏడిపిస్తున్నారని,ఇప్పటికైనా వారికి పూర్తిస్థాయిలో పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాలేరు నియోజకవర్గంలో జేఎన్టీయూ కళాశాల శిలాఫలకానికే పరిమితమైందని ఇది చాలా సిగ్గుచేటు అన్నారు. తెలంగాణ ఉత్సవాలు జరుపుకునే ధోరలు  పిడిత తాడిత ప్రజానీకాన్ని ఏడిపించిన వారే ఈరోజు తెలంగాణ సంబరాలు జరుపుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.రానున్న ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం లో బీఎస్పీ అభ్యర్థి అల్లిక వెంకటేశ్వరరావుని గెలిపించి తీరాలని,బీసీలు బహుజనులు  ఆలోచించుకోవాలని మన రాజ్యాన్ని మనమే పరిపాలించుకోవాలని కోరారు.
పాలేరు నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరవుతున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఖమ్మం జిల్లా సరిహద్దు బోర్డర్ నాయికన్ గూడెం వద్ద బీఎస్పీ నాయకులు కార్యకర్తలు బీఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం నాయకన్ గూడెం  పాలేరు, కూసుమంచి బైక్ ర్యాలీతో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెంట పాలేరు అసెంబ్లీ ఇంచార్జ్ అల్లిక వెంకటేశ్వరావు,ఉన్నారు

Prev Post చలో తుక్కుగూడ కాంగ్ర...
Next Post కాకతీయ వైద్య కళాశాలల...

More News