ఈడీ విచారణకు హాజరుకావడం లేదని కవిత అధికారులకు సమాచారం ఇచ్చారు. లీగల్ టీం ద్వారా కవిత ఈడీకి లేఖపంపారు. మరోవైపు మహిళలను ఈడీ కార్యాలయానికి పిలవొద్దంటూ.. కవిత దాఖలు చేసిన పిటిషన్ కాసేపట్లో సుప్రీంలో విచారణకు రానుంది.
నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వచ్చిన కవిత.. కాసేపట్లో సీఎం క్యాంప్ ఆఫీస్ కు వెళ్తారని తెలుస్తోంది.ఈడీ నోటీసులపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై కేసీఆర్‌తో చర్చిస్తారని తెలుస్తోంది. అక్కడే లీగల్ అడ్వైజర్లతో భేటీ అవుతారని సమాచారం. ఇప్పటికే కవిత తన తరపున లాయర్లను ఢిల్లీకి పంపారు. సుప్రీంకోర్టులో ఇవాల్టి విచారణ తర్వాత ఈడీ విచారణకు హాజరుతానని అడ్వకేట్‌తో ఈడీ అధికారులకు సమాచారం ఇచ్చారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ నోటీసులపై సుప్రీంకోర్టులో కవిత వేసిన పిటిషన్ కాసేపట్లో విచారించనుంది ధర్మాసనం.ఈడీ తనకు జారీ చేసిన సమన్లు రద్దు చేయాలని ధర్మాసనంను కోరారు కవిత.తనపై ఈడీ ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు.సుప్రీంలో కవిత తరపున సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ వాదనలు వినిపించనున్నారు.ఇదిలా ఉండగా లిక్కర్ స్కాం కేసులో విచారణకు రావాలని కవితను ఈడీ ఆదేశించింది. ఈ క్రమంలోనే ఆమె తన తండ్రి కేసీఆర్‌తో సమావేశం కానున్నారు.