బిఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి అన్నారు. సోమవారం ఆత్మకూరు మండలంలోని పెద్దాపురం గ్రామంలో రూ.80లక్షలతో గ్రామంలో పూర్తిచేసిన సిసి రోడ్లతో
పాటు నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభంచేసి మహిళ కమ్యూనిటీ భవనం నిర్మాణ పనులు ప్రారంభం చేశారు. ఎమ్మేల్యే మాట్లాడుతూ...బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలు, పట్టణాల రూపురేఖలు మారిపోయాయని, గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం అధిక మొత్తంలో నిధులు మంజూరు చేస్తున్నదని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలు అభివృద్ధి చెందాయన్నారు.ఇతర పార్టీ నాయకులు కూడా గ్రామ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు.దశలవారీగా అభివృద్ధి పనులను పూర్తి చేసి సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దటానికి కట్టుబడి ఉంటానన్నారు. అభివృద్ధితో పాటు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులైన అందరికీ దక్కేలా సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో తెలంగాణ అన్ని అంశాల్లోనూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నదన్నారు.గత ప్రభుత్వాలు ప్రజలను పట్టించుకున్న దాఖలాలు లేవని అన్నారు.ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సిఎం కేసీఆర్ పరిపాలన కొనసాగిస్తున్నారని,ప్రజల్లో బి.ఆర్.ఎస్.ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే అసత్యపు ప్రచారాలు చేస్తున్న ప్రతిపక్షాలను తగిన శాస్తి ప్రజల చేతుల్లో తప్పదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.