జగిత్యాల జిల్లా మల్యాల మండలం లో
తెలంగాణ విమోచన దినోత్సవం పురస్కరించుకొని మండలంలొ జాతీయ పతాకావిష్కరణ ఘనంగా నిర్వహించారు. అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు, గ్రామ పంచాయతీలు, పోలీస్ స్టేషన్, మార్కెట్ యార్డ్, సింగిల్ విండో కార్యాలయాలు, ఆయా పార్టీ ఆఫీస్ ల ముందు జాతీయ పతాకం ఎగురవేసి, జనగణమన ఆలపించారు. ఈ కార్యక్రమంలొ ఎంపీపీ మిట్టపల్లి విమల, మార్కెట్ యార్డ్ చైర్మన్ నరేందర్ రెడ్డి, ఎంపీడీఓ వెంకటేష్, తహసీల్దార్ మునీoదర్, సీఐ కోటేశ్వర్, సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్ విండో అధ్యక్షులు, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.