మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. శ్వేతా గ్రానైట్స్ సంస్థ
గ్రానైట్ ఎక్స్ పోర్ట్స్ ద్వారా ఫెమా నిబంధనలు ఉల్లంఘించి 4 కోట్ల 8 లక్షల రూపాయల ఫ్రాడ్ కు పాల్పడినట్లు ఈడీ ఆరోపించారు. చైనాకు గ్రానైట్ మెటీరియల్ ఎక్స్ పోర్ట్ చేయటంలో అక్రమాలు జరిగినట్టు గుర్తించారు. ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులో కేవలం 3 కోట్లు మాత్రమే శ్వేతా ఏజెన్సీస్ చెల్లిందని పేర్కోన్నారు. సుమారు 50 కోట్ల వరకు పెండింగ్ ఉందని, హవాలా మార్గంలో డబ్బు ట్రాన్స్ ఫర్ చేసినట్లు ఆధారాలున్నాయన్నారు. గత ఏడాది నవంబర్ లో శ్వేతా ఏజెన్సీస్ పై ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.