Thursday, January 09
Breaking News:

మంత్రి మహేందర్ రెడ్డికి అధ్యాపకుల వినతి

1693814619_WhatsApp Image 2023-09-04 at 1.30.09 PM.jpeg

నిజామాబాద్ లోని  తెలంగాణ విశ్వవిద్యాలయం లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న అధ్యాపకులో ప్రమోషన్ల విషయంలో సహకరించాలని విశ్వవిద్యాలయం అధ్యాపక సంఘం నాయకులు రాష్ట్ర సమాచారం పౌర సంబంధాలు మరియు గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి ని అభ్యర్థించారు. 
హైదరాబాదులోని మంత్రి మహేందర్ రెడ్డి నివాసంలో అధ్యాపక సంఘం నాయకులు అసిస్టెంట్ ప్రొఫెసర్లు నాగరాజు బాలకిషన్ సమతా భూమి మహేందర్ పాల్ నాగరాజు తదితరులు మంత్రిని కలిసి వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా వారు గత 2012లో తమకు నియామక పత్రాలు అందించారని అప్పట్లో ఎన్నికల కోడ్ కారణంగా కొన్ని ఆగిపోయాయని చెప్పారు 2014 నుండి విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న అధ్యాపకులలో 45 మందికి ఇంకను ప్రమోషన్లు ఇదే లేదని వివరించారు తమకు ప్రమోషన్లు ఇవ్వాలని కోర్టు ఆదేశం సైతం ఉందని చెప్పారు రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయంలో అధ్యాపకుల ప్రమోషన్లు ప్రక్రియ పూర్తయిన ఒక్క తెలంగాణ విశ్వవిద్యాలయంలో మాత్రమే 45 మందికి గత ఏడు సంవత్సరాలుగా ప్రమోషన్లు వాయిదా వేస్తూ ఉన్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
అధ్యాపకుల సమస్యలను విన్న మంత్రి మహేందర్ రెడ్డి వాటిని  సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకుపోతామన్నారు. అలాగే మంత్రి  కేటీఆర్ ,  విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ల తో దృష్టికి సైతం తీసుకొని వస్తానని చెప్పారు. సీఎం కేసీఆర్ పై పూర్తి నమ్మకంతో పనిచేయాలని ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ విశ్వవిద్యాలయంలో మిగిలిపోయిన అధ్యాపకులందరికీ ప్రమోషన్లు వచ్చేలా చూస్తారని మహేందర్ రెడ్డి వారికి స్పష్టమైన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మహేందర్ రెడ్డి వివరించారు.

Prev Post అందవెల్లి పెద్దవాగుప...
Next Post 4 సార్లు దాస్యం వినయ...

More News