Thursday, January 09
Breaking News:

మరో కీలక భేటీకి సిద్ధమైన ఇండియా కూటమి..

1694586095_india alliance.jpg

ఇండియా కూటమి మరో కీలక భేటీకి సిద్ధమైంది. పాట్నా, బెంగళూరు, ముంబై, ఢిల్లీ మీటింగ్స్‌ తర్వాత ఫస్ట్‌టైమ్‌ సమన్వయ కమిటీ సమావేశం కాబోతోంది. 14మందితో కూడిన కోఆర్డినేషన్‌ టీమ్‌ మొదటిసారి కూర్చోబోతోంది. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ నివాసంలో ఈ కీలక మీటింగ్‌ జరగబోతోంది. ఇండియా కూటమిలో అత్యంత కీలకమైంది ఈ సమన్వయ కమిటీ. విధానపరమైన అధికారాలను ఈ టీమ్‌కే కట్టబెట్టింది ఇండియా కూటమి. ఏ నిర్ణయమైనా ఈ కమిటీనే తీసుకోనుంది. అంటే, ఈ పద్నాలుగు మంది చేతిలోనే ఇండియా కూటమి ప్రయాణం, భవిష్యత్‌ ఆధారపడి ఉంది. వీళ్లు తీసుకునే నిర్ణయాలే కూటమిని నడిపించబోతున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల దగ్గర్నుంచి సీట్ల పంపకాల వరకు సమన్వయ కమిటీదే ఫైనల్‌ నిర్ణయం. అందుకే, ఇవాళ జరిగే ఈ సమావేశం అత్యంత కీలకంకాబోతోంది.

Prev Post టీపీసీసీ అధ్యక్షులు...
Next Post నేడు వరంగల్‌లో టీసీస...

More News