కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 10 లక్షల రూపాయలు మంజూరు చేపించుకోవలి అంటే ఎమ్మెల్యేలు నాన కష్టాలు పడేవారనీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్వర్యంలో వేల కోట్ల రూపాయలతో అభివృధి చేశామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
నియోజకవర్గం లోని కూకట్పల్లి డివిజన్లో స్థానిక కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ తో కలిసి 32 వ రోజు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాదయాత్ర నిర్వహించారు. వెంకట్రావు నగర్,ప్రకాష్ నగర్ ,శాంతి నగర్ పలు కాలనీలలో పాదయాత్ర చేపట్టి ప్రజాల సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ కూకట్ పల్లి డివిజన్ పలు కాలనీలలో ఉండడం వలన భారీ వర్షాలు సంభవించినప్పుడు వర్షపు నీరు డ్రైనేజీ నీరు కాలనీలలో రావడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఎమ్మేల్యే అన్నారు. మంత్రి కేటీఆర్ సమకరంతో అధికారుల సమక్షంలో రిటర్నింగ్ వాళ్ళు ఏర్పాటు చేసి వర్షపు నీరుని నాళాలోకి వెళ్లేలా ప్రణాళికలు చేపడతామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూకట్ పల్లి లో వేల కోట్ల రూపాయలతో అభివృధి చేశామని a ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని అని అన్నారు. డివిజన్ లో 90 శాతం పనులు పూర్తయ్యాయని మిగిలిన పనులను త్వరతగతిన పూర్తి చేస్తామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు