భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని మొండికుంట లో రక్షాబంధన్ సందర్భంగా వృక్షాబంధన్ జరుపుకున్న మొండికుంట గ్రామ సర్పంచ్ మర్రి మాల్లారెడ్డి,ఉప సర్పంచ్ మేడవరపు సుధీర్.అన్నదమ్ముల అక్కచెల్లెళ్ళ అనుబంధాలకు ఆదర్శంగా మరియు పవిత్రంగా జరుపుకునే రక్షాబంధన్ రోజున అన్నాచెల్లెళ్ల ఆప్యాయత అనురాగం ఎంత ముఖ్యమో మానవాళికి వృక్షాలు కూడా అంతే ముఖ్యమని చాటి చెబుతూ మొండికుంట గ్రామంలో సర్పంచ్ మర్రి మాల్లారెడ్డి వృక్షాబంధన్ జరుపుకొని ప్రతిఒక్కరికీ ఆదర్శంగా నీలిచారు. గ్రామ ప్రజలకు మానవాళికి చెట్ల యొక్క ప్రాముఖ్యత తెలిసేలా ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటే విధంగా ఆలోచింపజేస్తూ ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు.